సౌత్ ఇండియన్ తారలందరిలో ముద్దుగా బొద్దుగా ఉండే నిత్యా అంటే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమంతా ఆలోచిస్తుందట. ప్రస్తుతం అత్యద్భుతమైన, అందమైన కథానాయికల్లో నిత్యమీనన్ ఒకరనేది జగమెరిగిన సత్యం. నిత్యా మీనన్ ఎలాంటి పాత్రల్లోనైనా అలా పరికాయ ప్రవేశం చేయగలదు. అలా ఆ పాత్రను బాగా పండించగలదు. కానీ ఆమెయాక్షన్ ఎపిసోడ్ పద్ధతిని మాత్రం కొంతమందిని ఇబ్బందులు పాలు చేస్తుందట. ఆమె వ్యవహార శైలిని చూస్తే చాలామందికి మింగుడుపడటం లేదని ప్రచారం జరుగుతుంది. కానీ ఏదో ఉండి ఉంటుంది... అక్కట ఎలాంటి నిప్పూ లేకపోతే పొగరాదు కదా.. షూటింగ్ జరిగేప్పుడు దర్శకుడి చేయాల్సిన దాంట్లో ఏలెడుతుందని, అలాంటి సమయంలో ఎంత వారించినా లెక్క చేయకుండా ప్రవర్తిస్తుందని పరిశ్రమంతా కోడై కూస్తుంది. అశ్వనీదత్, అల్లుడు నాగ్ అశ్విన్ తో, మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాలనుకొంటున్నాడని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర సావిత్రి కోసం నిత్యమీనన్‌ని దాదాపు నిర్మాత ఓకే చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. తీరా ఇప్పుడు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిత్యా వ్యవహార శైలి గురించే ఆలోచనలో పడ్డాడట.
మొత్తానికి ఏమనుకున్నారో ఏమోగానీ అశ్వనీదత్ ఆమెని పిలిచి సంప్రదింపులు కూడా జరిపాడని తెలుస్తుంది. అయితే అక్కడ కూడా నిత్య ఆలోచనలు, ఆమె పద్ధతి ఆయనకు సుతరామూ నచ్చలేదని టాక్. దీంతో మండిన నిర్మాతకు నిత్య స్థానంలో అనుష్క అయితే ఎలా ఉంటుందని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ మొదట్లో నాగ్ అశ్విన్ కూడా అనుష్క నే కావాలన్నాడంట. ఆమె కాల్షీట్లు ఇప్పట్లో ఖాళీ అయ్యేలా కనిపించకపోవడంతో నిత్యని ఎంచుకొన్నాడని సమాచారం. ఇప్పుడు చూడబోతే అశ్వనీదత్ మాత్రం నిత్య మీనన్ వద్దే వద్దంటున్నట్టు కూర్చున్నాడని సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే చివరికి సావిత్రి రోల్ ఎవరు పోషిస్తారో చూడాలి. అనుష్కనా, నిత్యా మీననేనా.. చూద్దాం ఏం జరుగుతుందో.