Advertisementt

గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో మోడి సూట్...!

Sun 21st Aug 2016 03:18 PM
narendra modi,suit,guinness record,obama  గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో మోడి సూట్...!
గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో మోడి సూట్...!
Advertisement
Ads by CJ

భారత ప్రధాని నరేంద్రమోడి ధరించే సూట్ కు అరుదైన గౌరవం దక్కింది. గతంలో ఈ సూట్  వేలానికి పెడితే భారీ ధర పలికింది. ఇప్పుడు మోడీ ఆ సూట్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. మోడీ సూట్ గిన్నిస్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. కాగా మోడీ గతంలో ధరించిన ఓ సూట్ ను గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి రూ 4,31,31,311 కు సొంతం చేసుకున్నాడు.  ఆ వేలం 2015 ఫిబ్రవరి 20వ తేదీన జరిగింది. అయితే ఈ సూట్ ను మోడి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ధరించాడు. అప్పట్లో ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా విమర్శలు కూడా గుప్పించాయి. ఈ సూట్ తయారీకి రూ. 10 లక్షలు ఖర్చవడంతో ప్రతిపక్షాలు ప్రధానిని పెద్దఎత్తున విమర్శించాయి. ఈ సూట్ ను వేలంలో కొన్న వజ్రాల వ్యాపారి లాల్జీ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ .... దేశం కోసం ఏదో ఒకటి చేయాలని తనకు ఉండేదని, ఈ సూట్ కు వచ్చిన డబ్బులతో గంగానదిని ప్రక్షాళన చేస్తారని తనకు తెలిసిందని అందుకే సూట్ ను కొన్నానని అన్నాడు. కాగా ఈ సూట్ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడైన సూట్ గా గిన్నిస్ రికార్డ్స్ లో దీనికి చోటు లభించింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ