Advertisementt

రామ్‌చరణ్‌కు అతను ప్లస్‌ అవుతాడా..!

Sun 21st Aug 2016 08:27 PM
cinematographer,manoj paramahamsa,dhruva movie,ram charan,plus  రామ్‌చరణ్‌కు అతను ప్లస్‌ అవుతాడా..!
రామ్‌చరణ్‌కు అతను ప్లస్‌ అవుతాడా..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్‌చరణ్‌ తన 'ధృవ' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్ద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సురేంద్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. తమిళ 'తని ఒరువన్‌'కు రీమేక్‌గా ఈచిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమిళంలో సంగీతం అందించిన హిపాప్‌ తనూజనే తెలుగులోనూ సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రంలో కేవలం మూడుపాటలే ఉంటాయని, రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలోలా ఈ చిత్రంలో ఆరు పాటలు ఉండవని, కథ ఫ్లో సీరియస్‌గా సాగే ఈ చిత్రంలో పాటలు సినిమాకు అడ్డంకిగా వస్తాయని భావిస్తున్నారట.  ఈచిత్రం ఆడియో విడుదలకు కూడా రంగం సిద్దమవుతోంది. తెలుగులో ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్యా సంస్ద ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనుంది. ఇక ఈచిత్రం ఆక్టోబర్‌ 7న దసరా కానుకగా విడుదలకు రెడీ అవుతోంది. ఈచిత్రం తర్వాత రామ్‌చరణ్‌ సుకుమార్‌తో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్‌ నిర్మించే ఈ మూడవ చిత్రానికి ప్రస్తుతం ఆర్టిస్టుల, టెక్నీషియన్ల ఎంపిక జరుగుతోంది. తన కెరీర్‌లో ఇప్పటికే 'ఏమాయ చేసావే, రేసుగుర్రం' వంటి హిట్‌ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చేస్తున్నాడట. హీరోలను స్లైలిష్‌గా, సినిమాను కనుల విందులా తీయడంలో సిద్దహస్తుడైన మనోజ్‌ పరమహంస ఈచిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌ గా మిగులుతాడని చెబుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ