Advertisementt

ఆ విషయంపై నాగ చైతన్య ఫుల్ క్లారిటీ...!

Mon 22nd Aug 2016 03:35 PM
naga chaitanya,2 movies,september 9th 2 movies release,premam movie,sahasam swasaga sagipo movie,full clarity  ఆ విషయంపై నాగ చైతన్య ఫుల్ క్లారిటీ...!
ఆ విషయంపై నాగ చైతన్య ఫుల్ క్లారిటీ...!
Advertisement
Ads by CJ

తన 'ప్రేమమ్' విషయంలో హీరో నాగచైతన్య పక్కా క్లారిటీ ఇచ్చేశాడు. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. కష్టమంటే ఏం లేదు కాని.... అలా విడుదల చేయడం చాలా అరుదైన సందర్భమనే చెప్పవచ్చు.  హీరో నాగ చైతన్య నటించిన రెండు సినిమాలు సెప్టెంబర్ 9న వ తేదీనే విడుదల కాబోతున్నట్లుగా ఇంతకు ముందంతా చెప్పుకొచ్చారు. అలా జరగడానికి వీల్లేదు అన్నట్లు హీరో నాగ చైతన్య స్పష్టం చేశాడు.  

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన  ‘ప్రేమమ్’ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్టుగా నిర్మాతలు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ప్రకటించిన కాసేపటి తర్వాత సెప్టెంబర్ 9వ తేదీనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నట్టు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ట్వీట్స్ ద్వారా వెల్లిడించాడు. అలా నాగ చైతన్య రెండు సినిమాలు ఒకే రోజు అంటే సెబ్టంబర్ 9 శుక్రవారం నాడే విడుదల కావడం ఖాయం అని పరిశ్రమ అంతా భావించింది.

ఈ అంశంపై నాగ చైతన్య స్పందించాడు. ఒక హీరోకు సంబంధించిన రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేయడం కుదరని పని అని, సెప్టెంబర్ 9న ‘ప్రేమమ్’ను విడుదల చేసి, ఆ తర్వాత 'సాహసం శ్వాసగా సాగిపో’ను విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కానీ ‘ప్రేమమ్’ కంటే ముందుగానే ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రీకరణ పూర్తయిందనీ, పలు కారణాల వల్ల విడుదల ఆలస్యమైందన్నాడు. కాగా తాను నటించిన చిత్రాల్లో సినిమాకు సినిమాకు కొంత  గ్యాప్ తీసుకొని విడుదల చేయనున్నట్లు నాగ చైతన్య వివరించాడు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ