మారుతి దర్శకత్వంలో వెంకటేష్, నయనతార జంటగా వచ్చిన 'బాబు బంగారం' చిత్రం విడుదల రోజునే డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాటు విడుదలైన సాయి ధరమ్ తేజ 'తిక్క' సినిమా ఘోరం గా ప్లాప్ టాక్ తెచ్చుకోవడం 'బాబు బంగారం' సినిమా కు ప్లస్ అయింది. అయితే 'బాబు బంగారం' చిత్రం ఇప్పటికే రూ.20కోట్ల షేర్‌ను ప్రపంచవ్యాప్తంగా సాధించిందని, తమ చిత్రానికి అనుకున్న ఓపెనింగ్స్‌తో పాటు మంచి వసూళ్లు రావడంతో ఈచిత్రం తమ దృష్టిలో మంచి విజయం సాధించిన చిత్రంగా... ఈ చిత్ర యూనిట్ పేర్కొంటోంది. వెంకటేష్ సోలో హీరోగా చేసిన 'బాబు బంగారం' చిత్రం ఆయన కెరీర్‌లో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచిందని, కాబట్టే ఈ చిత్రాన్ని మంచి సక్సెస్‌గానే ట్రేడ్‌వర్గాలు కూడా ఒప్పుకుంటున్నాయి. మొత్తానికి ఈ వయసులో కూడా వెంకీ సినిమాలకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్‌ను ఈ చిత్రంతో మరలా నిరూపించుకున్నాడాయన. మరి వసూళ్లు పరంగా బాగా కలెక్షన్ వస్తే దానిని హిట్ కిందనే లెక్క వేయాలని కూడా ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి.