ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, మోహన్‌లాల్, సమంత, నిత్యామీనన్‌లతో మైత్రి మూవీ మేకర్స్ సంస్ద నిర్మిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 2వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. ఈ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసి ఆగష్టు 27న సెన్సార్‌కు వెళ్లాలని టీమ్ భావిస్తోంది. మరో పక్క ఈ చిత్రం మలయాళ వెర్షన్‌పై కూడా దృష్టిపెడుతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్స్‌తో ఈ చిత్రం భారీ అంచనాలను పెంచింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఇదే వారంలో ప్రారంభించడానికి యూనిట్ సిద్దం అవుతోంది. ఈ చిత్రం ఓ మంచి సందేశంతో రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ చిత్రంతో కొరటాల, ఎన్టీఆర్‌లు హ్యాట్రిక్ కొడతారా? మలయాళంలో కూడా ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుంది.? మైత్రి మూవీస్ ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తుందా? లేదా? అనేవి వేచిచూడాలి.