Advertisementt

టెన్ష‌న్ కంటే..బాధ్యతే ఎక్కువ: రామ్ చరణ్

Mon 22nd Aug 2016 09:45 PM
ram charan,megastar,khaidi no 150,ram charan special pooja,mega star birthday,ram charan about khaidi no 150  టెన్ష‌న్ కంటే..బాధ్యతే ఎక్కువ: రామ్ చరణ్
టెన్ష‌న్ కంటే..బాధ్యతే ఎక్కువ: రామ్ చరణ్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ పుట్టిన‌రోజు ఉత్స‌వాల్ని ఘ‌నంగా జ‌రిపించిన అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు - మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌

ఆగ‌స్టు 22(నేడు)న‌ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని మెగా ఫ్యాన్స్  9 రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు దేవాల‌యాల్లో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి మెగాస్టార్ త‌న కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మ‌క‌మైన 150వ సినిమాలో న‌టిస్తున్నారు కాబ‌ట్టి ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ని మెగా ఫ్యాన్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హించారు. ప్ర‌ఖ్యాత దేవాల‌యాల్లో హోమాలు, పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. నేడు ఫిలింన‌గ‌ర్ (హైద‌రాబాద్‌) దైవ‌స‌న్నిధానంలో పూజా మ‌హోత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ ముగింపు పూజల్లో 150వ సినిమా నిర్మాత‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ అభిమానుల‌ను ఉద్ధేశించి మాట్లాడారు. ఘ‌నంగా మెగాస్టార్‌ పుట్టిన‌రోజు సంబ‌రాలు చేసినందుకు అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఫ్యాన్స్‌ పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌డం త‌న‌కి చాలా ఆనందాన్నిచ్చింద‌ని చ‌ర‌ణ్ అన్నారు. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ స్వ‌గృహం వ‌ద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ఫ్యాన్స్‌కి కృత‌జ్ఞ‌తాభివంద‌నాలు తెలియ‌జేశారు చ‌ర‌ణ్‌. 

Chiranjeevi Birthday Special Pooja at Film Nagar Temple Photos

ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ...వారం, ప‌దిరోజులుగా అభిమానులు పెద్ద ఎత్తున ఏపీ, తెలంగాణ‌లోని దేవాల‌యాల్లో మెగాస్టార్ కోసం.. పూజ‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు స్వామినాయుడు స్వీయ‌సార‌థ్యంలో ఈ పూజా కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా జ‌రిగాయి. అభిమానులంద‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు. ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ఆఖ‌రి పూజా మ‌హోత్స‌వాల‌కు హాజ‌ర‌వ్వ‌డం సంతోషాన్నిచ్చింది. అభిమానులు ప్ర‌తి సంవ‌త్స‌రం ఇలా పుట్టిన‌రోజు వేడుక‌ల్ని ఆస‌క్తిగా జ‌రుపుతున్నారు. అందుకు ధ‌న్య‌వాదాలు. ఈరోజు సాయంత్రం శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌రుగుతున్న ఫ‌స్ట్‌లుక్ లాంచ్ కార్య‌క్ర‌మానికి నేను వ‌స్తున్నా. వ‌రుణ్‌తేజ్‌, బ‌న్ని, బాబాయ్ నాగ‌బాబు.. హాజ‌ర‌వుతున్నారు. నాన్న‌గారు ప్ర‌తియేటా పుట్టిన‌రోజు వేళ‌ ఏదైనా ఫామ్‌హౌస్‌లో సింపుల్‌గా గ‌డిపేస్తారు. ఇప్పుడిలా నాన్న‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ కోసం `ఖైదీ నంబ‌ర్ 150` లుక్ రిలీజ్ చేయ‌డం.. ఈ సంద‌ర్భంగా అభిమానుల్ని క‌లవ‌డం సంతోషంగా ఉంది. క‌థానుసారం ఈ సినిమాలో క‌థానాయ‌కుడు ఖైదీ పాత్ర‌లో క‌నిపిస్తారు కాబ‌ట్టి ఆ సినిమాకి ఆ టైటిల్ ని నిర్ణ‌యించాం. క‌థ‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే టైటిల్ ఇది. నిజానికి ఇప్పుడే ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ అంటే చాలా ముంద‌స్తు అవుతుంది. దీపావ‌ళి త‌ర్వాత రిలీజ్ చేయాల‌నుకున్నాం. కానీ ఫ్యాన్స్ కోరిక మేర‌కు ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ లాంచ్ చేస్తున్నాం..అన్నారు. 

Chiranjeevi Birthday Special Pooja at Film Nagar Temple Video

టెన్ష‌న్ అధిగ‌మించి బాధ్య‌త‌గా ఉన్నా:

నిర్మాత‌గా తొలి ప్ర‌య‌త్నం ఎలాంటి అనుభవాలిచ్చింది? అని ప్ర‌శ్నిస్తే.. తొలి సినిమా నిర్మాత‌గా టెన్ష‌న్ ఉన్నా.. అంత‌కుమించి బాధ్య‌త‌గా ప‌ని చేస్తున్నాను. ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు పెద్ద అండ‌. అన్నీ ఆయ‌నే అయ్యి పూర్తి స‌పోర్టు ఇస్తున్నారు. స‌గం (గంట‌న్న‌ర‌) సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. కొన్ని పాట‌లు, టాకీ, ఫైట్స్ తెర‌కెక్కించాల్సి ఉంది.... అని చ‌ర‌ణ్ తెలిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ