Advertisementt

పవన్ ఫ్యాన్స్ ని కావాలనే..పక్కనెట్టారా!

Wed 24th Aug 2016 01:24 PM
pawan kalyan,chiranjeevi birthday celebrations,pawan kalyan fans,power star fans,mega fans,chiranjeevi  పవన్ ఫ్యాన్స్ ని కావాలనే..పక్కనెట్టారా!
పవన్ ఫ్యాన్స్ ని కావాలనే..పక్కనెట్టారా!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు చిరు ఫ్యాన్స్ నిర్వహించారు. అయితే ఈ వేడుకలకి చిరంజీవి రాలేదు కానీ మెగా హీరోలందరూ హాజరయ్యారు. మెగా హీరోలు అంటే అందులో పవన్ కూడా వున్నాడనుకునేరు. పవన్ తప్ప మిగతా అందరు అన్నమాట. వారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మిగిలిన వారు ఈ వేడుకలకి హాజరయ్యారు.  పవన్ కి ఆహ్వానం అందలేదో..... లేక ఆహ్యానించినా తానే రాలేదో తెలియదు కానీ ఇప్పుడదే హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తన అన్న చిరు బర్త్ డే సందర్భం గా ఆయనకి ఫేస్ టూ ఫేస్ కానీ.... కనీసం ట్వీట్స్ ద్వారా కానీ విశేష్ చెప్పలేదు. పోనీ ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసిన వేడుకకి రాకపోయినా.... కనీసం చిరు ఇచ్చిన ప్రవేట్ బర్త్ డే పార్టీ లో కూడా పవన్ కనిపించలేదు. ఇప్పుడు ఇంతగా చెప్పొచ్చేదేమిటంటే.... ఏదైనా మెగా ఈవెంట్ జరుగుతుంది అంటే అక్కడ మెగా ఫ్యాన్స్ కొంతమంది పవన్, పవన్ అంటూ అరుపులు, కేకలతో రెచ్చిపోతుంటారు. ఆ మధ్య ఈ విషయమై అల్లు అర్జున్ ఫాన్స్ ని ఉద్దేశించి గట్టి హెచ్చరికలే చేసాడు. ఇక ఆ విషయం లో అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫాన్స్ గుర్రుగా వున్నారని సోషల్ మీడియాలో వార్తలొచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే నిన్న(22-08-16) జరిగిన చిరు బర్త్ డే ఈవెంట్లో పవన్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎక్కడా పవన్ పేరు జపించలేదు. అంటే పవన్ ఫ్యాన్స్ ని మెగా ఈవెంట్ కి పిలవలేదనేగా దానర్ధం. అంటే ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పిలిస్తే ఇక్కడ రచ్చ జరుగుతుందని ముందే ఊహించి ఉంటారు మెగా హీరోలు... అందుకే వారిని దూరం గా పెట్టారు అనుకుంటున్నారు జనాలు. అంటే మెగా ఫ్యామిలిలో చీలికలే కాకుండా మెగా ఫ్యాన్స్ లో కూడా చీలికలు వచ్చినట్లేగా....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ