హీరోయిన్ అమలాపాల్, విజయ్‌ల వివాహం జరిగి, ఆ తర్వాత అది విడాకుల రూపానికి దారితీసిన సంగతి తెలిసిందే. కాగా అమలాపాల్, విజయ్‌ల మద్య వివాహం పెటాకులు కావడానికి 'వడా చెన్నై' చిత్రమే కారణం అనేది అందరికీ తెలిసిందే. ధనుష్ హీరోగా నటించనున్న 'వడా చెన్నై' చిత్రంలో అమలాపాల్‌ను హీరోయిన్‌గా తీసుకోవడం, ఆ చిత్రంలో నటిస్తానని అమలాపాల్ పట్టుబట్టడం, ఇక చిత్రాల్లో నటించవద్దని భర్త విజయ్ అడ్డుచెప్పడం, చివరికి వారి పెళ్లి పెటాకులు కావడానికి దారితీసింది. తీరా 'వడాచెన్నై' చిత్రం కోసం తన వివాహ జీవితాన్నే పణంగా పెట్టిన అమలాపాల్‌కు ప్రస్తుతం షాక్ తగిలింది. ఈ చిత్రం నుంచి అమలాపాల్‌ను తప్పించి మరో కొత్త హీరోయిన్‌ను సెలక్ట్ చేయమని స్టార్ హీరో దనుష్ యూనిట్‌కు హుకుం జారీ చేశాడట. ఈ చిత్రంలో అమలాపాల్‌ను ఎందుకు తప్పించాలనుకున్నారో తెలియడం లేదు. మొత్తానికి ధనుష్ మాత్రం అమలాని తొలగించడంతో ఇప్పుడు అమలాపాల్ పరిస్థితి ఉన్నదిపోయే..... ఉంచుకున్నది పోయే అన్నచందంగా రెంటింటికి చెడ్డ రేవడిలా తయారైందని అంటున్నారు.