టాలీవుడ్, కోలీవుడ్ నుండి బాలీవుడ్ లో అడుగు పెట్టగానే సౌత్ హీరోయిన్స్ రేంజ్ ఆటోమాటిక్ గా పెరిగిపోతుందా? అంటే అవును అంటున్నారు సౌత్ హీరోయిన్స్. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతూ బాలీవుడ్ లో ఛాన్స్ రాగానే పేరొచ్చిన ఇండస్ట్రీ ని వదిలేయడానికి కూడా వెనుకంజ వెయ్యడం లేదు. అంటే బాలీవుడ్ అంటే అంత ఎక్కువ మిగిలినివి తక్కువనేగా సౌత్ హీరోయిన్స్ ఫీలింగ్. అప్పుడెప్పుడో తెలుగులో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతూనే బాలీవుడ్ లో అవకాశం రాగానే అక్కడ సెట్టిల్ అవుదామని కలలు గన్న ఇలియానా అక్కడ సరైన అవకాశాలు రాక అక్కడ ఉండలేక మళ్ళీ సౌత్ కి రాలేక తెగ ఇబ్బంది పడుతోంది. మరి ఇప్పుడు అదే వరుస మన రెజీనాకి కూడా వర్తించేలా కనబడుతుంది. ఇక్కడ చిన్నా చితకా హీరోస్ తో నటించి ఒక మాదిరి పేరుతెచ్చుకుని... సరైన అవకాశాలు రాక దిక్కులు చూస్తున్న రెజీనా.. బాలీవుడ్ లో అమితాబచ్చన్ సినిమాలో లీడ్ రోల్ లో నటించేందుకు ఎన్నికైంది. ఇక అక్కడ మొదలైంది అసలు కథ. ఇక్కడ సందీప్ కిషన్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ వంటి చిన్న చిన్న హీరోలతో కనిపించి సరైన గుర్తింపు రాక...... ఇక్కడి నిర్మాతలను పెద్దగా డిమాండ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏదో... ఒక్కో సినిమాకి 50 నుండి 60 లక్షలు తీసుకునేది రెజీనా. మరి అటు బాలీవుడ్ లో అడుగు పెట్టగానే తన రేంజ్ మారిపోయినట్లు ప్రవర్తిస్తుంది. అమితాబ్ వంటి పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా.... మరి నాకు వచ్చిన అవకాశం మామూలుది కాదుగా అని.... తన రెమ్యునరేషన్ ని అమాంతం గా పెంచి పడేసింది. ఇప్పుడు ఏకంగా 1.5 కోటి డిమాండ్ చేస్తుందని సమాచారం. అవున్లే బాలీవుడ్ సినిమాల రేంజ్ అంతే కాబట్టి తన రెమ్యూనరేషన్ రేంజ్ కూడా అలానే పెంచేసింది అనుకుంటున్నారు జనాలు. ఇక టాలీవుడ్ లో 'జ్యో అచ్యుతానంద' సినిమాలో, కృష్ణ వంశీ 'నక్షత్రం' సినిమాలో, బాలీవుడ్ రీమేక్ 'హంటర్' లో రెజీనా హీరోయిన్ గా చేస్తుంది. బాలీవుడ్ లో 'ఆంఖేన 2' లో ఒక లీడ్ రోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడాని కి రెజీనా తెగ ట్రై చేస్తుందని వినికిడి.