Advertisementt

ఎన్టీఆర్‌ తీరును తప్పుపడుతున్నారు!

Sat 27th Aug 2016 08:01 AM
ntr,jr ntr,vinod royal,pawan kalyan fan,message,young tiger  ఎన్టీఆర్‌ తీరును తప్పుపడుతున్నారు!
ఎన్టీఆర్‌ తీరును తప్పుపడుతున్నారు!
Advertisement
Ads by CJ

మా హీరో కంటే మా హీరో గొప్ప అనే భ్రమలో తాము అభిమానించే హీరోల కోసం తగాదాలు, చివరకు ప్రాణాలు తీయడం కూడా జరుగుతోంది. దీనికి ఇటీవల పవన్‌కళ్యాణ్‌ అభిమాని వినోద్‌రాయల్‌.. ఎన్టీఆర్‌ వీరాభిమానులతో తలపడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్‌ వెళ్లి అక్కడ తన అభిమానులను ఉద్దేశించి.. హీరోలమంతా సమానమేనని, తమ మద్య ఎలాంటి తగాదాలు లేవని, కానీ అభిమానులు మాత్రం ఇలా గొడవపడవద్దంటూ తన అభిమానులకు సందేశం పంపాడు. కానీ మరోవైపు ఎన్టీఆర్‌ ఈ ఘటన జరిగి నాలుగైదు రోజులైనా, ఈ సమయంలో దీనిపై మీడియాలో చర్చసాగుతుంటే తాను మాత్రం ఇప్పటివరకు తన అభిమానులను ఉద్దేశించి ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణం. ఆయన తన 'జనతాగ్యారేజ్‌' విడుదల విషయంలో బిజీగా ఉన్నాడు. కానీ ఒక్క ఐదు నిమిషాలైనా ఆయన ఈ సంఘటనను తప్పుపట్టి, ఇలాంటివి చేయవద్దని తన అభిమానులకు సందేశం ఇవ్వలేనంతబిజీగా ఉన్నాడా? అని పలువురు ఇండస్ట్రీ పెద్దలే చెవ్వులుకొరుకుంటున్నారు. మరి ఈ సంఘటనను తప్పుపట్టకుండా, ఖండించకపోవడం దారుణమని మాత్రం చెప్పవచ్చు. సంఘటనతో ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం లేనప్పటికీ ఈ ఘటనను ఖండించి, తన అభిమానులను ఉద్దేశించిన నాలుగు మాటలు మాట్లాడకపోవడం అందరినీ నిశ్చేష్ఠులను చేస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ