Advertisementt

ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదేనా?

Sun 28th Aug 2016 02:45 PM
jr ntr,dhadkan,vakkantam vamsi,dhadkan title for ntr,thiru,devisri  ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదేనా?
ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదేనా?
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ తాజాగా నటించిన 'జనతా గ్యారేజ్' చిత్రం విడుదలకు సిద్హమైంది. సెప్టెంబర్ 1 న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తున్నాడట. ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఉంటుందని ఎప్పటి నుండో చెబుతున్న విషయమే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడనే విషయము తెలిసిందే. ఇక 'జనతా గ్యారేజ్' చిత్రం విడుదల అయిన తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. అయితే వంశీ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే చిత్రానికి టైటిల్ కూడా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. కళ్యాణ్ రామ్ తన బ్యానేర్ లో 'ధడ్కన్' అనే  టైటిల్ రిజిస్టర్ చేయించాడని... ఇదే ఎన్టీఆర్ చిత్ర టైటిల్ అవుతుందని అంటున్నారు. ఈ టైటిల్ ఎన్టీఆర్ కి కరెక్ట్ గా సూట్ అవుతుందని ఆలోచిస్తున్నారట.  అయితే ఎన్టీఆర్ ఈ చిత్రం లో ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే 'టెంపర్' లో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇంకా ఈ చిత్రం లో ఒక ఇంపార్టెంట్ పాత్ర కోసం జగపతి బాబు ని ఎంపిక చేస్తారని సమాచారం. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కూడా సెట్ అయ్యాడని.... ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తాడని టాక్. ఇంకా 'జనతా గ్యారేజ్' కి కెమెరా మాన్ గా పనిచేసిన తిరు నే ఈ చిత్రానికి పనిచేస్తాడని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ