తిరుపతి వేదికగా జనసేన పార్టీ అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ బహిరంగ సభలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై చాలా విస్తృతంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జనసేనాని హోదాలో పవన్ చేసిన ప్రసంగానికి సూపర్బ్ స్పందన వచ్చింది. దీనిపై చాలా మంది విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. కాగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ.. పవన్ మాట్లాడిన మాటల్లో చాలా నిజాయితీ ఉంది. ఈ విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ రాజకీయం చేయకండి. ఒక ప్రాంతం పురోభివృద్ధి కోసం అంతా కలిసికట్టుగా ముందుకు రండి అంటూ రాజకీయ పార్టీల నేతలందరికీ పిలుపునిచ్చాడు. కాగా శివాజీ.. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడి హోదాలో పైవిధంగా స్పందించాడు. తాను ఇంకా మాట్లాడుతూ... ఇటువంటి ఓ వ్యక్తి రోడ్ల మీదికి వచ్చి పోరాటాలు చేస్తే ప్రత్యేక హోదా మూడు నెలల్లోనే వచ్చి తీరుతుందని ఇంతకుముందే ఆయన మీడియాలో వెల్లడించినట్లుగా గుర్తు చేశాడు.
ఇంకా శివాజీ మాట్లాడుతూ పవన్ ప్రసంగంపై రాజకీయాలు చేయకండి. రాజకీయపరమైన ప్రసంగాలు కట్టిపెట్టండి. ఈ విషయంపై పవన్‌ని విమర్శించకుండా ఆంధ్ర ప్రాంతానికి ఏం కావాలో దానిపై కలిసికట్టుగా పోరాడండి అని శివాజీ తనదైన శైలిలో స్పందించారు. చివరగా శివాజీ మాట్లాడుతూ... పవన్ మాటిచ్చినట్టు నిజంగా హోదా కోసం రోడ్లపైకి రాకపోతే అప్పుడు చూద్దాం మన తడాఖా అంటూ హెచ్చరిక చేశాడు కూడానూ. ఇంకా కూడా జగన్‌పై బాబు, బాబుపై జగన్ విమర్శించుకోవడం మానివేసి ప్రజల కోసం ఏదైనా చేయడంపై దృష్టి సారించండని శివాజీ సలహా ఇచ్చాడు.