Advertisementt

క్లారిటీ ఇచ్చిన కొరటాల... మహేష్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ!

Sun 28th Aug 2016 09:00 PM
mahesh babu,koratala siva,super hit combination,srimantudu combination repeat,producer d.v.v.danayya  క్లారిటీ ఇచ్చిన కొరటాల... మహేష్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ!
క్లారిటీ ఇచ్చిన కొరటాల... మహేష్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ!
Advertisement
Ads by CJ

ఈనాటి నిర్మాతలు మంచి కాంబినేషన్‌ను సెట్‌ చేసి జాక్‌పాట్‌ కొట్టాలని ఆశిస్తున్నారే తప్ప.. మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్స్‌ను సెట్‌ చేసి... కర్చీఫ్‌లు వేయడంలో నిర్మాత దానయ్య అందరికంటే ముందుంటాడు. ప్రస్తుతం మహేష్‌బాబు, మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మహేష్‌ చేయబోయే చిత్రం ఏమిటి? అనే విషయంలో నిన్నటి వరకు కన్‌ఫ్యూజన్‌ నెలకొని ఉంది. ఆయన కోసం పూరీ, విక్రమ్‌.కె. కుమార్‌, త్రివిక్రమ్‌ వంటి దర్శకులు లైన్‌లో ఉన్నారు. కానీ మహేష్‌ మాత్రం 'శ్రీమంతుడు' తర్వాత దానయ్య నిర్మాతగా అదే దర్శకుడు కొరటాల శివతో కలిసి ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ విషయంపై కొరటాల శివ నుంచి క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం మహేష్‌ నటిస్తోన్న మురుగదాస్‌ చిత్రం పూర్తయిన వెంటనే ప్రారంభమవుతుందని, 'జనతా గ్యారేజ్‌' తర్వాత ఇదే స్క్రిప్ట్‌ మీద తాను దృష్టిపెడతానని కొరటాల క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఆయన మహేష్‌కు ఓ స్టోరీలైన్‌ వినిపించి ఓకే కూడా చేయించుకున్నాడు. ఇక మురుగదాస్‌ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతుండటంతో ఈ రెండు భాషలకు చెందిన నటీనటులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా తమిళంలో కమెడియన్‌గా, నటునిగా ఇరగదీస్తున్న ఆర్జేబాలాజీని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని బాలాజీ కూడా కన్‌ఫర్మ్‌ చేశాడు. ఇందులో తాను మహేష్‌కు స్నేహితుని పాత్రలో నటిస్తున్నానని, కేవలం కమెడియన్‌గా మాత్రమే కాక ఇందులో తన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, తను మహేష్‌తో కలిసి పలు కీలక సన్నివేశాల్లో నటిస్తున్నానని తెలిపాడు. తాను ఎప్పటి నుండో మురుగదాస్‌ చిత్రంలో నటించాలన్న కోరిక ఈ చిత్రంతో తీరుతోందని ఆయన సంతోషంగా ఉన్నాడు.