ప్రకాష్ రాజ్... ఆయన పేరు తెలియని తెలుగు వాడు ఉండడు. గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ తమిళ, కన్నడ తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. కాగా సుమారు రెండు దశాబ్దాల పాటు తీరిక లేకుండా తన నటనను క్షణ క్షణం తీర్చిదిద్దుకున్నాడు ప్రకాష్ రాజు. కొన్ని కొన్ని సార్లు రోజుకు రెండు షిఫ్టుల్లో కూడా పని చేసి తన సత్తా చాటుకున్నాడు. అందుకే ఆయన విషయంలో ఎన్ని వివాదాలు వచ్చినా తెలుగు పరిశ్రమ ప్రకాష్ రాజును వదులుకోలేకపోయింది. ఎన్నో వందల సినిమాలలో అద్భుతమైన నటనను, వైవిధ్యభరితమైన పాత్రలను పోషించాడు ప్రకాష్ రాజు.
ప్రస్తుతం కాస్త ఖాళీ దొరికింది. అందుకనే ఇప్పుడాయన వ్యక్తిగత జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది ఆయన మరో బిడ్డకు తండ్రి అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన భార్య కూడానూ పరిశ్రమకు సంబంధించిన ఒకప్పటి డ్యాన్స్ మాస్టర్ పోనీ వర్మ. కాగా తన కొడుకు ఫస్ట్ లుక్ ను కూడా అప్పట్లో పరిచయం చేయగా అందరూ ఎగబడి చూశారు. కానీ ఇప్పుడు తీరికగా గడుపుతున్న ప్రకాష్ రాజ్ తన భార్య, కొడుకుతో కలిసి మొన్నటి వరకు దుబాయిలో సేదదీరి వచ్చాడు. కాగా అక్కడ దుబాయిలోని ఓ మాల్ లో కొడుకును స్టోలర్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తూ కెమెరాకు దొరికిపోయాడు ప్రకాష్ రాజ్. సెలబ్రిటీలు ఎంత దాక్కొని పోదామన్నా కెమెరాకు మాత్రం వారు చిక్కాల్సిందే. కాగా ప్రకాష్ రాజ్ ఈ వయసులో తన బుడతడుతో కలిసి వస్తున్న ఫొటో చూపురులకు ఆసక్తి రేపుతోంది.
ప్రకాష్ రాజ్ కు పోనీ వర్మ రెండో భార్య అన్న విషయం అందరికీ విదితమే. అయితే ఆయన మొదటి భార్య అయిన లలితా కుమారికి, ప్రకాష్ రాజుకు ఇద్దరు అమ్మాయిలు కలిగారు. కానీ ప్రకాష్ రాజ్, లలిత కుమారి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతనే పోనీ వర్మతో ప్రేమలో పడ్డాడు. మొత్తానికి పెళ్లి కూడా చేసుకున్నాడు. పిల్లోడినీ కనేశాడు. అప్పట్లో అంతా ప్రకాష్ ను చూసి ఈ వయస్సులో ఈయనకు ప్రేమేంటి అన్నారు గానీ పిల్లాడు కలిగాక ఎంత ఘాటు ప్రేమో అంటు ఆనందపడ్డారు ఆయన అభిమానులు. కాగా ప్రకాష్ రాజ్ తెలుగు, కన్నడ భాషల్లో ‘మనవూరి రామాయణం’ అనే సినిమాను చేస్తున్నాడు. హిందీలో ‘తడ్కా’ అనే సినిమా తీస్తున్నాడు.