ఏదో ఒక సినిమా హిట్ అవ్వగానే సౌత్ హీరోయిన్స్ నిర్మాతల నెత్తిన ఎక్కి తాండవం చేసేస్తారు. ఇది నిజం సౌత్ హీరోయిన్స్ ఇలానే చేస్తున్నారు. ఏదో ఒకటి ఆరా సినిమాలు చేస్తూ అందులో ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాళ్ళ అసలు రంగు బయటపెట్టేస్తున్నారు. వారిలో ఇప్పుడు ప్రముఖం గా మాట్లాడుకునే హీరోయిన్ రీతూ వర్మ. రీతూ వర్మ ఈ మధ్య చిన్న సినిమా గా వచ్చి కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న 'పెళ్లి చూపులు' హీరోయిన్. ఈ 'పెళ్లి చూపులు' సినిమాలో హీరో విజయ్ దేవరకొండకి ఎంత పేరైతే వచ్చిందో హీరోయిన్ రీతూ వర్మకి అంతే పేరు వచ్చింది. ఇంకేముంది అమ్మడు చెట్టెక్కి కూర్చుంది. రెమ్యూనరేషన్ విషయం లో రీతూ వర్మ ఇప్పుడు చాలా బెట్టు చేస్తుందని ఈమె రేటు విని నిర్మాతలకు దిమ్మ తిరుగుతుందని సమాచారం. అయితే 'పెళ్లి చూపులు' సినిమా రిలీజ్ కి ముందు రీతూ కొన్ని సినిమాల్లో చెయ్యడానికి ఒప్పుకుంది. కానీ 'పెళ్లి చూపులు' చిత్రం రిలీజ్ అయ్యి సైలెంట్ హిట్ అవ్వడం తో అమ్మడు అసలు రంగు బయటపడిందని..... ముందు ఒప్పుకున్న సినిమాల నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని సమాచారం. అసలు ఈమె మొదట్లో 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేదని 'పెళ్లి చూపులు' హిట్ తర్వాత 20 నుండి 25 లక్షలు డిమాండ్ చేస్తుందని సమాచారం. ఇంకా సినిమాల ఎంపికలో చాలా అతి చేస్తుందని అంటున్నారు. అంతేగా మరి ఒక సినిమా హిట్ అయిన హీరోయిన్ ఇలా అతి చెయ్యకపోతే మజా ఏముంటుంది.