Advertisementt

సింధు వాళ్లకి ఏమాత్రం తీసిపోదు!

Tue 30th Aug 2016 09:30 PM
pv sindhu,fashion interest,sachin,bmw,pv sindhu interest on fashion  సింధు వాళ్లకి ఏమాత్రం తీసిపోదు!
సింధు వాళ్లకి ఏమాత్రం తీసిపోదు!
Advertisement
Ads by CJ

పి.వి సింధు ఇప్పుడు అందరి నోటిలో అదే పేరు. ఆమె ఒలింపిక్స్ బ్యాట్మెంటన్ లో భారత్ కి రజత పథకాన్ని అందించి దేశ కీర్తి ప్రతిష్టలు అమాంతంగా పెంచేసింది. 130 కోట్లమంది వున్న ఇండియా కి వెండి పథకాన్ని కానుకగా ఇచ్చిన బంగారు తల్లి పి.వి సింధు. వెండి పథకాన్ని గెలుచు కొచ్చినందుకు తెలుగు రాష్ట్రాలతో సహా ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సింధుకి భారీ నజరానాలు ప్రకటించాయి. అంతే కాకుండా తెలంగాణ స్పోర్ట్స్ కమిటీకి అధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్ పివి సింధు కి బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి దానిని సచిన్ చేతుల మీదుగా అందచేశారు. ఇంకా ఇండియా కి పథకాలు తెచ్చిన సాక్షి మాలిక్, దీప కి, పి.వి సింధు ని విజేత గా నిలిపిన కోచ్ గోపీచంద్ కి కూడా వేర్వేరు వ్యక్తుల  ద్వారా బీఎండబ్ల్యూ కారులు బహుమతులుగా ఇవ్వబడ్డాయి. వీటిని కూడా సచిన్ తన చేతుల మీదుగా విజేతలకు అందించాడు. అయితే ఈ ఫంక్షన్ కి హాజరైన సాక్షి మాలిక్, దీప లు ఫ్యాన్టు షర్టుతో హాజరయ్యారు. కానీ సింధు మాత్రం ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ లో హాజరై అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె కు ఆ డ్రెస్ చక్కాగా అద్దినట్లుగా సూట్ అవ్వడమే కాదు ఒక మోడల్ లా అందరిని అలరించింది. అయితే ఇప్పుడు సింధు ఫ్యాషన్ వైపు కూడా అడుగులు వేస్తున్నదా... అందుకే ఇలా రెడీ అయ్యిందా అనేది కోటి బిలియన్ డాలర్ల ప్రశ్న?. ఇదేం పెద్ద ప్రశ్న కాదు ఎందుకంటే మన ఇండియన్ ఆటగాళ్లు ఇటు క్రీడా రంగం లోనే కాకుండా అటు ఫ్యాషన్ రంగం లో కూడా రాణిస్తున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుండి  సానియా మీర్జా, సైనా నెహ్వాల్ లు కూడా వున్నారు. వీరు అటు ఆటలోనే కాకుండా ఇటు ఫ్యాషన్ రంగంలో కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే సింధు కూడా వీరి పంచన చేరేటట్టు ఉందని అంటున్నారు క్రీడా రంగ నిపుణులు.