మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా 'ఖైదీ నెంబర్ 150' గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తుండగా ఒక స్పెషల్ సాంగ్ లో తమన్నా నటిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాని రామ్ చరణ్ తల్లి... చిరంజీవి భార్య సురేఖ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ అంతా ఒక సన్నివేశం లో కనిపించబోతుంది అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు మెగా డాటర్ నాగబాబు కూతురు చిరంజీవి 150 వ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో నటిస్తుందని సమాచారం. నాకు అవకాశం వస్తే మా పెదనాన్న 150 సినిమాలో నటించాలని ఉందని నిహారిక ఒక ఫంక్షన్ లో చెప్పింది. అందుకే చిరు నిహారికకు ఒక గెస్ట్ రోల్ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ వి.వి.వినాయక్ ని కోరగా.. ఆయన దానికి ఒప్పుకుని... నిహారికకు ఒక ఇంపార్టెంట్ రోల్ ని సెట్ చేసే పనిలో పడ్డాడని సమాచారం. అంటే మెగా డాటర్ 150 వ సినిమాలో ఒక మెరుపు మెరుస్తుందన్నమాట. ఇప్పటికే నిహారిక 'ఒక మనసు' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అయితే 150 వ సినిమాకి సంబంధించి మరో విషయం ఏమిటంటే ఈ సినిమా సెట్స్ కి చాల మంది ప్రముఖులు విచ్చేసి చిరంజీవి గారికి విషెస్ చెబుతున్నారట. మొన్నామధ్య అల్లు అర్జున్ 'డీజే' సినిమా ఓపెనింగ్ సందర్భం గా దిల్ రాజు, హరీష్ శంకర్ 150 సినిమా సెట్ ని సందర్శించగా... తాజాగా అక్కినేని అఖిల్ 'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్ లో సందడి చేసాడట. దీనికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక అఖిల్ తన ఫ్రెండ్ రామ్ చరణ్ ని కలవడానికి... అలాగే తన మొదటి సినిమా డైరెక్టర్ వి.వి వినాయక్ ని కలవడానికి ఆ సెట్ కి వెళ్ళాడట. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాని ఎలాగైనా సంక్రాంతికి విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ కృషి చేస్తుందని సమాచారం.