Advertisementt

చరణ్ కోసం సుక్కు శపథం..!

Thu 01st Sep 2016 08:48 PM
ram charan,sukumar,formula x movie,ram charan and sukumar movie details  చరణ్ కోసం సుక్కు శపథం..!
చరణ్ కోసం సుక్కు శపథం..!
Advertisement
Ads by CJ

సుకుమార్‌ ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయమై 12 ఏళ్లయింది. ఈ పుష్కరకాలంలో ఆయన చేసినవి అరడజను సినిమాలు మాత్రమే. అంటే సగటున రెండేళ్లకు ఓ చిత్రం మాత్రమే. అలాంటి ట్రాక్‌ రికార్డు ఉన్న సుకుమార్‌ తాజాగా ఓ చిత్రాన్ని కేవలం మూడునెలల్లో పూర్తిచేస్తానని శపథం చేస్తున్నాడు. 'నాన్నకు ప్రేమతో' తర్వాత ఇప్పటికే 8నెలలైనా సరే ఇంకా సుక్కు మాత్రం రామ్‌చరణ్‌ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ 'ధృవ' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 7న విడుదల కానుంది. ఈచిత్రం విడుదలైన వెంటనే అంటే అక్టోబర్‌లోనే సుకుమార్.. రామ్‌చరణ్‌ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్ద తమ మూడో చిత్రంగా నిర్మించనుంది. కాగా ఈ చిత్రానికి 'ఫార్ములా ఎక్స్‌' అనే టైటిల్‌ పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని సార్లు ఇదో సైన్స్‌ఫిక్షన్‌ మూవీ అని, మరికొన్ని సార్లు ఇదో సున్నితమైన ప్రేమకథా చిత్రమని ప్రచారం సాగుతోంది. కాగా ఈచిత్రాన్ని కేవలం 90రోజుల వర్కింగ్‌ డేస్‌లో పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. మరి అనుకున్న సమయానికి, అందునా కేవలం మూడు నెలల్లోనే ఈ చిత్రాన్ని తీస్తే సుక్కు సంచలనం సృష్టించడం ఖాయమనే వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ