Advertisementt

కాజల్ గురించే టాక్...!

Thu 01st Sep 2016 09:36 PM
kajal agarwal,item song,heroine,dj duvvada jagannadam,khaidi number 150,heroine or item girl  కాజల్ గురించే టాక్...!
కాజల్ గురించే టాక్...!
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు. గత కొంత కాలంగా ఆమెకు సినిమాలు పెద్దగా లేవు. అయితే  అనూహ్యం గా కాజల్ ఒక్కసారిగా బిజీ తార అయిపొయింది. అటు చిరంజీవి 150 వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' లో  చిరంజీవి పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ 'డీజే దువ్వాడ జగన్నాధం'  సినిమాలో బన్నీ కి జంటగా నటించనుందని వార్తలొస్తున్నాయి. హీరోయిన్ గా బిజీ అవ్వడమే కాకుండా తాజాగా కాజల్ ఐటెం గర్ల్ గా కూడా మారిపోయింది. జనతా గ్యారేజ్ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ లో మెరిసింది. అయితే ఈ సాంగ్ లో కాజల్ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చెయ్యడం తో పాటు డాన్స్ విషయం లో కూడా కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టిచ్చిందని అంటున్నారు. ఈ సాంగ్ లో కాజల్ ఒంపుసొంపులన్నీ బాలీవుడ్ ఐటెం సాంగ్స్ కి స్పెషల్ అయినా కత్రినాని గుర్తు చేస్తున్నాయి అంటున్నారు. బాలీవుడ్ లో కత్రినా ఐటెం సాంగ్ సినిమాలో వుంది అంటే ఆమె కోసమే సినిమాలు చూసే అభిమానులు చాలా మందే వున్నారు. ఆమె డాన్స్ లో  తన శరీరాన్ని అలా స్ప్రింగ్ లా తిప్పేస్తుంది. ఇక ఇక్కడ కాజల్ కూడా తన మొదటి ఐటెం సాంగ్ లో తన ఒంపు సొంపులతో  కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుందనేది నిజం. అలా కాజల్ మొదటి ఐటెం ని సక్సెస్ ఫుల్ గా నిలబెట్టుకుంది. మరి హీరోయిన్ గా బాగా బిజీ అయిన కాజల్ మరిన్ని ఐటమ్స్ లో కనిపిస్తుందో లేక ఐటెం సాంగ్స్ లో నటించనని చెబుతుందో చూద్దాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ