Advertisementt

నయన్ నెక్స్ట్ స్టెప్ ఇదేనా..!!

Fri 02nd Sep 2016 10:26 AM
nayanthara,politics,nayanthara into politics,jayalalitha,nayan enters politics  నయన్ నెక్స్ట్ స్టెప్ ఇదేనా..!!
నయన్ నెక్స్ట్ స్టెప్ ఇదేనా..!!
Advertisement
Ads by CJ

వయసు పెరిగినా ఏ మాత్రం క్రేజ్‌ తగ్గని హీరోయిన్‌ ఎవరంటే అది ఖచ్చితంగా నయనతారే అని చెప్పాలి. ఈమె దెబ్బకు కోలీవుడ్‌లో మిగిలిన హీరోయిన్లు బెంబేలెత్తుతున్నారు. సినిమాకి 2కోట్లు తీసుకుంటున్న నయననే తమ చిత్రంలో నటించాలని యువ హీరోల నుండి సీనియర్‌ హీరోల వరకు క్యూకడుతున్నారు. ప్రస్తుతం ఆమె దాదాపు అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది. కాగా ఈ కేరళ కుట్టి ఇప్పటినుండే తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ గురించి ఆలోచిస్తుందని సమాచారం. సహజంగా తాను నటించిన చిత్రాల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా ఆమె ఒప్పుకోదు. అలాంటి నయన తమిళనాడులోని అధికార పార్టీ అయిన అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఆహ్వానం అందుకొని ఇటీవల కొన్ని రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దీంతో తమిళ రాజకీయ, సినిమా వర్గాలు అశ్చర్యపోతున్నాయి. అమ్మ బాటలోనే నయన నడుస్తోందని, గతంలో ఖుష్బూ, నమితల లాగానే నయన కూడా సినిమాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత ఖచ్చితంగా పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఆమె రాజకీయాల్లోకి వస్తే ఏమాత్రం స్పందన ఉంటుందనే విషయమై తమిళ సినీ,రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌ నడుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ