Advertisementt

రామ్ చరణ్‌ తో పోటీకి వస్తున్నారు..!

Fri 02nd Sep 2016 08:49 PM
ram charan,dhruva,naga chaitanya,premam,nikhil kumar,jaguar,tamanna abhinetri,vijayadasami season  రామ్ చరణ్‌ తో పోటీకి వస్తున్నారు..!
రామ్ చరణ్‌ తో పోటీకి వస్తున్నారు..!
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్షకులకు సమ్మర్‌, సంక్రాంతి సీజన్ల తర్వాత విజయదశమికి మంచి గిరాకీ ఉంటుంది. పిల్లలకు సెలవులు కావడంతో ఈ రోజుల్లో చిత్రం వస్తే రికార్డు కలెక్షన్లు వసూలు చేయవచ్చని దర్శకనిర్మాతలతో పాటు హీరోలు కూడా భావిస్తుంటారు. కాగా ఈ ఏడాది విజయదశమి గిఫ్ట్‌గా రామ్‌చరణ్‌ నటిస్తున్న 'ధృవ' చిత్రం విడుదల కానుంది. అక్టోబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అదే సమయంలో మలయాళ సంచలన చిత్రం 'ప్రేమమ్‌' రీమేక్‌గా నాగ చైతన్య, శృతిహాసన్‌లు నటిస్తున్న 'ప్రేమమ్‌' కూడా దసరాకే రానుందని పోస్టర్లు కూడా రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కన్నడ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'జాగ్వార్‌' చిత్రం కూడా అక్టోబర్‌ 6న విడుదలకు సిద్దమవుతోంది. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తమన్నా, ప్రభుదేవాలు నటిస్తున్న 50కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రం 'అభినేత్రి' కూడా అక్టోబర్‌6నే విడుదల కానుంది. అయితే సినిమా బాగుంటే మాత్రం 'ధృవ' చిత్రం ముందు ఈ చిత్రాలు నిలవలేవని, అందులోనూ ఈ చిత్రాన్ని స్వయాన అల్లుఅరవింద్‌ నిర్మిస్తుండటంతో ఈ చిత్రానికి కాదని మిగిలిన చిత్రాలకు థియేటర్లు కూడా దొరికే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ