Advertisementt

అయ్యో... పూజా హెగ్డేకి అలా జ‌రిగిందా?

Sat 03rd Sep 2016 12:00 PM
pooja hegde,mohanjodar,mukunda fame,pooja hegde,no offers for pooja hegde  అయ్యో... పూజా హెగ్డేకి అలా జ‌రిగిందా?
అయ్యో... పూజా హెగ్డేకి అలా జ‌రిగిందా?
Advertisement
Ads by CJ
హిందీలో ప‌రాభ‌వాన్ని ఎదుర్కొన్న ద‌క్షిణాది క‌థానాయిక‌ల జాబితాలో పూజా హెగ్డే కూడా చేరింది. ఎన్నో ఆశ‌లు పెట్టుకొని చేసిన `మొహొంజొదారో` సినిమా ఆమెకి చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. హృతిక్‌రోష‌న్ కథానాయ‌కుడిగా  అశుతోష్ గొవారిక‌ర్‌లాంటి గొప్ప ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఆ చిత్రం బాక్సాఫీసుపై ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈ సినిమా హిట్ట‌యితే  ఇక బాలీవుడ్‌లోనే స్థిర‌ప‌డిపోవాల‌నుకొన్న పూజా హెగ్డే ఆశ‌లు ఒక్క‌సారిగా గ‌ల్లంత‌య్యాయి. సినిమా కాదు క‌దా, పూజా చేసిన పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌కి న‌చ్చ‌లేదు. దీంతో బాలీవుడ్‌లో ఆమెకి  అవ‌కాశాలే ద‌క్క‌డం లేదు. మొహంజొదారోపై న‌మ్మ‌కంతో  తెలుగులోనూ   ఓ బంప‌ర్ ఛాన్స్ కూడా మిస్స‌యిన‌ట్టు తెలిసింది. పూజా `మొహంజొదారో` విడుద‌ల హంగామాలో ఉన్న‌ప్పుడే త‌న సంస్థ‌లో తెరకెక్క‌నున్న `డీజే` కోసం దిల్‌రాజు   సంప్ర‌దించాడ‌ట‌. అల్లు అర్జున్ స‌ర‌స‌న ఆమెని ఎంపిక చేయాల‌నుకొన్నాడ‌ట‌. కానీ మొహొంజొదారో హిట్ట‌యితే త‌న జాత‌క‌మే మారిపోతుంద‌నుకొన్న పూజా `డీజే`లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూప‌లేద‌ట‌. పారితోషికం ఎక్కువ ఇస్తామ‌న్నా ఆమె నో చెప్పింద‌ట‌. దీంతో దిల్‌రాజు బృందం మ‌రో ప్ర‌త్యామ్నాయం చూసుకొనేందుకు సిద్ధ‌మైంది. ఇంత‌లో `మొహొంజొదారో` ఫ్లాప్ అని తేలిపోయింది. దీంతో వెంట‌నే పూజా టాలీవుడ్‌లో అవ‌కాశాల‌కి సిద్ధ‌మే అని ప్ర‌క‌టించినా ఆమె వైపు మ‌న నిర్మాత‌లెవ్వ‌రూ క‌న్నెత్తి చూడ‌టం లేద‌ట‌. దిల్‌రాజు కూడా ఫ్లాప్ క‌థానాయిక క‌దా అంటున్నాడ‌ట‌.  మొత్తంగా అల్లు అర్జున్‌లాంటి స్టార్ క‌థానాయ‌కుడితో న‌టించే అవ‌కాశం తృటిలో చేజార్చుకొంది పూజ‌. ఇదివ‌ర‌కు ఈమె తెలుగులో ముకుంద‌, ఒక లైలాకోసం సినిమాల్లో న‌టించింది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ