Advertisementt

చైతూ కూడా `నిన్నే పెళ్లాడ‌తా` అంటాడా?

Sat 03rd Sep 2016 12:04 PM
nagachaitanya,nenne pelladutha,nagachaitanya for ninne pelladutha,nagarjuna tabu,krishna vamsi   చైతూ కూడా `నిన్నే పెళ్లాడ‌తా` అంటాడా?
చైతూ కూడా `నిన్నే పెళ్లాడ‌తా` అంటాడా?
Advertisement
Ads by CJ
నాగార్జున‌కి తిరుగులేని విజ‌యాన్ని అందించిన చిత్రాల్లో `నిన్నే పెళ్లాడ‌తా` ఒక‌టి.  కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆ చిత్రంలో నాగార్జున‌, ట‌బు జోడీ అద‌ర‌గొట్టింది. వాళ్లిద్ద‌రినీ తెర‌పై చూస్తే `ఆహా ఏం కెమిస్ట్రీ` అనిపిస్తుంది.   ఆ చిత్రం ఇప్పుడు చూస్తున్నా కొత్త‌గానే అనిపిస్తుంది. నాగ‌చైత‌న్య‌, అఖిల్‌లాంటి యంగ్ హీరోలతో  ఆ చిత్రాన్ని నిస్సందేహంగా  రీమేక్ చేయొచ్చు. అయితే నాగార్జున‌, ట‌బులు అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఒక‌లాగే ఉన్నారు. సో... ఆ సినిమాని రీమేక్ చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కావాల‌నుకొంటే మ‌ళ్లీ ఆ క్యాసెట్‌నే తిరిగి వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ  నాగ‌చైత‌న్య మాత్రం `నిన్నే పెళ్లాడతా`లో న‌టిస్తానంటున్నాడు. అయితే  నాగ్ `నిన్నే పెళ్లాడ‌తా`కీ, నాగ‌చైత‌న్య చేస్తానంటున్న  సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. అస‌లు విష‌య‌మేంటంటే నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా కళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ‌లోనే ఆ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఆ చిత్రానికి నిన్నే పెళ్లాడ‌తా పేరును ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.  ప‌క్కా ఫ్యామిలీ స‌బ్జెక్ట్ కావ‌డం, అందులో పెళ్లి ప్ర‌స్తావ‌న కూడా ఉంటుంది కాబ‌ట్టి  `నిన్నే పెళ్లాడ‌తా` అనే పేరైతేనే బాగుంటుంద‌ని క‌ళ్యాణ్‌కృష్ణ భావిస్తున్నాడ‌ట‌. అందుకు నాగార్జున కూడా ఓకే చెప్పేశార‌ని తెలుస్తోంది. అందులో క‌థానాయిక‌గా త‌మ‌న్నా కానీ, లేదంటే స‌మంతగానీ న‌టించే అవ‌కాశాలున్న‌ట్టు స‌మాచారం. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ