మరోసారి `ఆర్య2` జోడీని తెరపై చూడొచ్చన్న ఆశలకి గండిపడ్డాయి. `డీజే`లో అల్లు అర్జున్ సరసన నటించే కథానాయిక ఎంపిక ఇంకా పూర్తవ్వలేదని చిత్రబృందం చెబుతోంది. నిన్నటిదాకా బన్నీతో కాజల్ నటిస్తుందని ప్రచారం సాగింది. ఆ వార్తలకి తగ్గట్టుగానే దిల్‌రాజు `ఖైదీ నెంబర్ 150` సెట్‌కి వెళ్లి మరీ కాజల్‌తో మంతనాలు జరిపాడు. మరి ఏమైందో తెలియదు కానీ... కాజల్ నటించడం లేదని యూనిట్ చెబుతోంది. పారితోషికమో లేదంటే కాల్షీట్లో ఈ రెండు విషయాల్లో తేడాలొచ్చుండొచ్చని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. అయితే కాజల్ ప్లేస్‌లో ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. `కృష్ణగాడి వీర ప్రేమగాథ` ఫేమ్ మెహరీన్‌ని సంప్రదిస్తే ఎలా ఉంటుందా అని చిత్రబృందం ఆలోచిస్తోందట. ఇప్పటికే అల్లు శిరీష్ సరసన నటిస్తోందామె. ఇప్పుడు అన్న అల్లు అర్జున్ సరసన కూడా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మెహరీన్ పెద్దగా పారితోషికం డిమాండ్ చేయదు, పైపెచ్చు కావాల్సినన్ని కాల్షీట్లు కేటాయించేంత వీలూ ఆమెకుంది. సో... ఆ జోడీనే ఖాయం కావొచ్చనేది టాక్.