అక్కినేని అఖిల్ నటించిన తొలి చిత్రం 'అఖిల్' హిట్టయివుంటే ఈ పాటికి అఖిల్ పరిస్దితి వేరుగా ఉండేది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో అఖిల్ రెండో చిత్రం విషయంలో అనేక ట్విస్ట్‌లు తీసుకున్నారు. వంశీపైడిపల్లి, హను రాఘవపూడి చిత్రాలు మొదలవుతాయని భావించినా కొన్ని సాంకేతిక పరమైన కారణాల వల్ల అఖిల్ రెండో చిత్రం విషయంలో రోజుకో ట్విస్ట్ వచ్చేసింది. వంశీపైడిపల్లి, హనురాఘవపూడి చిత్రాలు ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టి తాజాగా 'ఇష్క్, మనం, 24' వంటి అద్బుత చిత్రాలను తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ లైన్‌లోకి వచ్చాడు. అఖిల్ రెండో చిత్రం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందనుందని నాగ్ సైతం క్లారిటీ ఇచ్చేశాడు. విక్రమ్ తయారు చేసిన ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు అఖిల్, నాగ్‌లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఇక ఇదే నెలలో నాగచైతన్య హీరోగా 'సోగ్గాడే చిన్నినాయనా' ఫేమ్ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలోని చిత్రం కూడా ప్రారంభం కానున్నాయి. ఇక ఆయన నటించిన 'ప్రేమమ్' దసరా కానుకగా రానుండగా, 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కోసం ఓ మంచి డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. ఇక నాగ్ విషయానికి వస్తే ఆయన తానే నిర్మిస్తూ, గెస్ట్‌పాత్రను చేస్తున్న 'నిర్మలాకాన్వెంట్' చిత్రం కూడా ఇదే నెలలో విడుదలకు రెడీ అవుతోంది. దీంతో ఈ నెల మొత్తం అక్కినేని అభిమానులకు పండగే పండగని చెప్పాలి.