త్రివిక్రమ్-పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో రాదాకృష్ణ నిర్మాతగా ఓ చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ చేయాలనుకుంటున్న స్టార్‌హీరోలందరూ వరస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన పవన్ సలహా మేరకు నితిన్‌ను హీరోగా పెట్టుకుని 'అ..ఆ' చిత్రం తెరకెక్కించి సూపర్‌హిట్‌ను అందుకున్నాడు. కాగా ఇప్పుడు కూడా త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడు. పవన్‌తో సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను తయారుచేసుకునే పనిలో ఉన్నాడు. కాగా ఈలోపల ఓ చిన్న హీరోతో మరో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. దీంతో నాని, శర్వానంద్ వంటి హీరోల పేర్లు బయటకు వచ్చినా ఆ హీరోలు కూడా వరుస కమిట్‌మెంట్లతో బిజీగా ఉన్నారు. దీంతో పూరీ లాగేనే త్రివిక్రమ్ కూడా తను తయారుచేసుకున్న ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు నాగశౌర్య అయితేనే బాగుంటుందని భావిస్తున్నాడు. ఇప్పటికే పూరీ, ఇప్పుడు త్రివిక్రమ్‌లతో సినిమాలు పడితే నాగశౌర్య స్టార్‌గా పేరుతెచ్చుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.