భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. గత సంవత్సరం హర్భజన్ సింగ్.. గీతా బస్రాను వివాహ మాడిన విషయం తెలిసిందే. అయితే ఈ దంపతులకు తాజాగా పండంటి బిడ్డ పుట్టింది. ఈ యేడాది జూలై మాసంలో పుట్టిన ఈ ఆడబిడ్డకు హర్భజన్ సింగ్ దంపతులు ఓ వెరైటీ పేరు పెట్టారు. తాజాగా తన ముద్దుల కూతురికి ఏం పేరు పెట్టారన్న విషయాన్ని హర్భజన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కాగా తన కూతురుకు 'హినయ హీర్ ప్లహా' అనే పేరు పెట్టామని హర్భజన్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన తన పాపకు ఆశీస్సులు అందజేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.
హర్భజన్ సింగ్ గత యేడాది తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు అయిన బాలీవుడ్ నటి గీతా బస్రాను పెళ్లాడాడు. అయితే మహేంద్రసింగ్ ధోనీ కూతురు పేరు 'జివా' అని పేరు పెట్టగా, మన క్రికెటర్ భజ్జీ కూతురు పేరు 'హినయ' అని పేరును పెట్టడం జరిగింది. ఈ పేరు చాలా బాగుందంటూ భారత క్రికెట్ అభిమానులు తమ ఆనందాన్ని వెల్లడిస్తున్నారు.