చిరంజీవి తన 150 చిత్రం గా 'ఖైదీ నెంబర్ 150' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ లో శ్రీమతి సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణ బాధ్యతల్ని రామ్ చరణ్ స్వయం చూసుకుంటున్నాడు. ఈ సినిమా రైతు సమస్యల ఆధారం గా తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని సమాచారం. అయితే ఈ రోజు వినాయక చవితి సందర్భం గా చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్ ఆఫీస్ లో గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా ఈ పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ వి.వి.వినాయక్, రామ్ చరణ్ పాల్గొన్నారు. చిరంజీవి ఎంతో భక్తి శ్రద్దలతో తన 150 చిత్రాన్ని విజయవంతం గా తెరకెక్కించాలని పూజ చేసినట్లు సమాచారం. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150' చిత్రం షూటింగ్ సగం పూర్తయిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతికి విడుదల చెయ్యాలని చూస్తున్నారు. అందుకే విరామం లేకుండా షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం.