సూర్య నటించిన తాజా చిత్రం '24' తెలుగు, తమిళ భాషల్లో హిట్టయినప్పటికీ అది కేవలం మామూలు హిట్ మాత్రమే. సూర్య కోరుకున్నంత స్థాయి హిట్‌ను మాత్రం ఈ చిత్రం ఇవ్వలేకపోయింది, దీంతో సూర్య ప్రస్తుతం హరి దర్శకత్వంలో రూపొందుతున్న 'సింగం3' చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నాడు. అనుష్క, శృతిహాసన్‌లు నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం తర్వాత ఎవరితో చిత్రం చేయాలనే డైలమాలో పడిపోయాడు సూర్య. త్రివిక్రమ్, రంజిత్‌పా, సుందర్ సి వంటి దర్శకులలో ఎవరితో చేయాలనే డైలమాలో ఉన్న సూర్య ఇప్పుడు తన తదుపరి చిత్రం విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నాడు. విఘ్నేష్ శివన్‌తో తన తదుపరి చిత్రం చేయడానికి కమిట్ అయిపోయాడు. 'నానుం రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న విఘ్నేష్ శివన్ చెప్పిన పాయింట్ బాగా నచ్చడంతో ఈ చిత్రాన్ని ఆయనతో చేయాలని డిసైడ్ అయ్యాడు. కాగా సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన సొంతబేనర్ అయిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించనున్నాడు.