Advertisementt

బరిలో నుండి చరణ్‌ తప్పుకున్నాడు!

Wed 07th Sep 2016 07:52 PM
ram charan,dhruva,dasara,vijaya dasami,ram charan dhruva out in vijaya dasami race,premam  బరిలో నుండి చరణ్‌ తప్పుకున్నాడు!
బరిలో నుండి చరణ్‌ తప్పుకున్నాడు!
Advertisement
Ads by CJ

అక్టోబర్‌ 7వ తేదీన రామ్‌చరణ్‌, అల్లుఅరవింద్‌, సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ధృవ' చిత్రం విడుదలవుతుందని అందరూ భావించారు. దాంతో చాలామంది ఈ చిత్రాన్ని ధృష్టిలో పెట్టుకొని తమ తమ చిత్రాల రిలీజ్‌ డేట్లను చాలా గ్యాప్‌తో విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. కాగా 'ధృవ'  చిత్రం వస్తుందనే విషయం తెలిసి కూడా నాగచైతన్య ఆ డేట్‌కు అటు ఇటుగా తన 'ప్రేమమ్‌' చిత్రాన్ని విడుదల చేయాలని ముందు నుంచి భావిస్తున్నాడు. కాగా అరవింద్‌స్వామికి ఆరోగ్యం సరిగా లేకపోవడం, షూటింగ్‌ పార్ట్‌, పాటల చిత్రీకరణ కూడా బ్యాలెన్స్‌ ఉండటంతో 'ధృవ' చిత్రం ఇప్పుడు పోస్ట్‌పోన్‌ అయింది. మొదట దీపావళి కానుకగా అనుకున్నప్పటికీ ఇప్పుడు 'ధృవ' రిలీజ్‌ ఇక డిసెంబర్‌లోనే అని ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఇక 'ధృవ' విడుదల అనుకున్న అక్టోబర్‌7 వ తేదీ 'ప్రేమమ్‌' కోసం లాక్‌ చేశారు. మలయాళంలో సెన్సేషనల్‌ హిట్‌ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ సాంగ్‌ ట్రైలర్‌ ఆల్రెడీ ఒకటి విడుదలైంది. 8వ తేదీన ఈ చిత్రంలోని మరో పాటను విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 20న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. మొత్తానికి డేట్స్‌ ఫిక్స్‌ విషయంలో ఎంతో టెన్షన్‌ పడిన 'ప్రేమమ్‌' యూనిట్‌కు చరణ్‌ మంచి అవకాశం ఇచ్చాడనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ