'మీలో ఎవరు కోటీశ్వరుడు' మా టీవీ లో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ ప్రోగ్రాం కి నాగార్జున హోస్ట్ గా చేసాడని తెలుసు. గత 3 సీజన్లను నాగార్జున విజయవంతంగా పూర్తి చేసాడు. అయితే ఇప్పుడు 4 వ సీజన్ ని కూడా మా టీవీ తెరకెక్కించబోతోందని సమాచారం. మా టీవీలో లో నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, చిరంజీవి కొంతమేర షేర్స్ కలిగివున్నారనే విషయం తెలిసిందే. అందుకే ఈ ప్రోగ్రాంని నాగార్జునే దగ్గరుండి మరి నడిపించి దానిని సక్సెస్ చేసాడని టాక్. అంతేకాదు..ఈ ప్రోగ్రాం రన్ అయినంతకాలం మా టీవీ టీఆర్పీ రేటింగ్స్ ఎక్కడికో వెళ్లిపోయాయి. మరి ఒకటి నాగార్జున హోస్ట్ అయితే మరొకటి అతని మాటకారి తనం... అందం అంతా కలిపి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం ని సక్సెస్ ఫుల్ గా నడిపించగలిగాడు. అయితే ప్రేక్షకులు వచ్చే 4 వ సీజన్ గురించి కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక 4 వ సీజన్ లో హోస్ట్ మారబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయన ఒక టాప్ సెలబ్రిటీ మరియు ఒక రాజకీయ నాయకుడు కూడా. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. 9 సంవత్సరాలుగా మేకప్ కి దూరంగా ఉండి ఇప్పుడు తన కెరీర్ లోనే ఒక మైలురాయిని అందుకోవడానికి 150 చిత్రాన్ని చేస్తున్నాడు. ఇంకా అటు రాజకీయాల్లో రాణిస్తూ ఇటు సినిమాలు కూడా చేసేస్తున్నాడు. ఇక ఇప్పుడు బుల్లితెరమీద కూడా ప్రేక్షకులను కనువిందు చెయ్యడానికి రెడీ అవుతున్నాడట చిరు. అవును 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 4 వ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడట మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సీజన్ ని డిసెంబర్ లో టెలికాస్ట్ చెయ్యడానికి మా టీవీ అన్ని సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఇక మెగా అభిమానులకు ఇలా బుల్లితెరనుండి కూడా మెగాస్టార్ సంతోషాన్ని పంచబోతున్నాడన్నమాట. చిరు రాకతో మా టీవీ యొక్క ఈ ప్రోగ్రాం టీఆర్పీ రేటింగ్స్ ఏ రేంజ్ కి వెళ్తాయో..చూద్దాం.