Advertisementt

ఈ హీరో ఇంకెన్ని అవతారాలు వేస్తాడో?

Thu 08th Sep 2016 04:29 PM
dhanush,power pandi,dhanush change as director,dhanush directs power pandi  ఈ హీరో ఇంకెన్ని అవతారాలు వేస్తాడో?
ఈ హీరో ఇంకెన్ని అవతారాలు వేస్తాడో?
Advertisement
Ads by CJ

తమిళ స్టార్‌ దనుష్‌కు హీరోగా దేశవ్యాప్త గుర్తింపు ఉంది. నటునిగా, నిర్మాతగా, గాయకునిగా.. ఇలా మల్టీటాలెంట్‌ ఉన్న హీరోగా దనుష్‌కు మంచి పేరుంది.కాగా ఇప్పుడు ఆయన మెగాఫోన్‌ కూడా చేతపట్టి ఓ చిత్రానికి దర్శకునిగా మారిపోయాడు. 'పందెం కోడి' ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్‌కిరణ్‌కు తమిళంలో మాంచి క్రేజ్‌ ఉంది. కాగా ధనుష్‌ తన దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రంలో ప్రధాన పాత్రకు రాజ్‌కిరణ్‌ను ఎంచుకున్నాడు. తన సొంత బేనర్‌ అయిన వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై దనుష్‌ ఈ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం పేరు 'పవర్‌పాండి'. ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది. తన దర్శకత్వంంలో రూపొందుతున్న చిత్రం కావడంతో దనుష్‌ ఈ చిత్రం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి దర్శకత్వ బాధ్యతలోనూ ఆయన విజయం సాధించి, దర్శకునిగా కూడా సక్సెస్‌ అవుతాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ