Advertisementt

కొడుకుని నిలబెట్టేందుకు.. పవన్ చెంతకు..!

Thu 08th Sep 2016 08:24 PM
pawan kalyan,nikhil kumar goud,kumara swamy,jaguar,jaguar audio launch  కొడుకుని నిలబెట్టేందుకు.. పవన్ చెంతకు..!
కొడుకుని నిలబెట్టేందుకు.. పవన్ చెంతకు..!
Advertisement
Ads by CJ

మాజీ ప్రదాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్‌కుమార్‌గౌడ్‌ కన్నడ, తెలుగు భాషల్లో హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'జాగ్వార్‌'. కాగా ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు మహదేవ్‌ దర్శకుడు, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఈ చిత్ర ఆడియోను తెలుగులో ఏకంగా రెండు కోట్లు ఖర్చుపెట్టి రిలీజ్‌ చేయనున్నారు. 75కోట్ల బడ్జెట్‌తో హీరోగా తెరంగేట్రం చేస్తోన్న నిఖిల్‌కుమార్‌గౌడ్‌కు పవన్‌ అండ ఉంటే నెగ్గుకురాగలడని, ఈ వేడుకకు చీఫ్‌ గెస్ట్‌గా పవన్‌ను ఆహ్వానించనున్నారు. పవన్‌ ఆడియో రిలీజ్‌ కార్యమ్రానికి వస్తే ఆ కిక్కే వేరని, అందులోనూ పవన్‌ చేతుల మీదుగా రిలీజ్‌ అయిన ఆడియోలు ఖచ్చితంగా సినిమా విజయాన్ని సాధిస్తాయనే సెంటిమెంట్‌ కూడా బలంగా ఉంది. అదే విధంగా పవన్‌ వస్తే ఆ వేడుక మీడియాలో హైలైట్ అవుతుందని కూడా నిర్మాత కుమారస్వామి ఆశిస్తున్నాడు. ఈ వేడుకకు పలు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ఉద్దండులు కూడా హాజరుకానున్నారని సమాచారం. అంతే కాకుండా పవన్‌ ఆడియోకు వస్తే పవన్‌ అభిమానులలో పాజిటివ్‌ బజ్‌ వస్తుందని, అది తెలుగులో ఈ కొత్త హీరోకు పెద్ద లాంచింగ్‌ అవుతుందని ఈ చిత్ర నిర్మాతతో పాటు యూనిట్‌ భావిస్తోంది. మరి ఈ విషయంలో కుమారస్వామి పాచిక పారుతుందా? లేదా? అనేది వెయిట్‌ చేయాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ