Advertisementt

వెంకయ్య మాట విని వెళ్ళారా..బడిత పూజే!

Fri 09th Sep 2016 08:09 PM
venkayya naidu,ap special status,bjp,bjp leaders,center,ap people fight  వెంకయ్య మాట విని వెళ్ళారా..బడిత పూజే!
వెంకయ్య మాట విని వెళ్ళారా..బడిత పూజే!
Advertisement
Ads by CJ

ఏపీకి ప్రత్యేక హోదా లేదని ప్రత్యేక ప్యాకేజి మాత్రమే అని ఫైనల్ గా కేంద్రం ఏపీకి చెయ్యవలిసిన మోసం చేసేసింది. ఇక ఏపీలో ప్రత్యేక హోదా సెగని రాజేసి కేంద్రం చేతులు దులుపేసుకుంది. ఇలా సెగలు రాజేసినాక కూడా వెంకయ్య నాయుడు మాత్రం ఏపీ బిజెపి నేతలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రజల్లోకి తీసుకెళ్లండి.... వారికి అర్ధమయ్యేలా చెప్పండి అని చెబుతున్నాడు. ఇంకేం అర్ధం కావాలి... ఏపీని నిండా ముంచి మీకు  చలివేస్తుందా అని అడిగినట్లు వుంది కదా. లేకపోతె మరేంటండి ఇచ్చిన తొక్కలో ప్యాకేజీని నేతలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలంట. తీసుకెళ్లండి తీసుకెళ్లండి... తీసుకెళ్లి చూడండి బిజెపి నేతల్లారా. మీ మొహం మీద రాళ్లు, కోడి గుడ్లు, టమోటాలు పడకపోతే చూడండి. ఖచ్చితం గా ఏపీ ప్రజలు ఈ పని చేసి చూపించడానికి రెడీ గా వున్నారు. బిజెపి నేతలు కనబడితే వాళ్లకి బడిత పూజ చెయ్యడానికి రెడీగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఇలాంటి సమయంలో వెంకయ్య నాయుడి మాటలు విని బిజెపి ఏపీ నేతలు గనక కాలు బయట పెడితే పరిస్థితులు చేదాటిపోయినా ఆశర్యపోవక్కర్లేదు. అసలు ప్రత్యేక ప్యాకేజీలో ఏముందని వీళ్ళు ప్రచారం చేస్తారు. ఏమంత ఉద్దరించామని ప్రజలకు వివరిస్తారు వీళ్ళు. అయ్యా వెంకయ్య మీరు ఒకసారి ఏపీకి రండి అప్పుడు తెలుస్తుంది హోదా కోసం ప్రజలు పడే బాధలు. ఢిల్లీ లో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు..! ఏమంటారు..ప్రజలారా..!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ