Advertisementt

కొరటాలకు.. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్?

Sat 10th Sep 2016 04:09 PM
koratala siva,janatha garage,10 stories,confidence  కొరటాలకు.. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్?
కొరటాలకు.. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్?
Advertisement
Ads by CJ

రచయిత నుండి దర్శకునిగా మారిన కొరటాల శివ 'జనతా గ్యారేజ్‌'తో వరుసగా మూడో బ్లాక్‌బస్టర్‌ అందించి హ్యాట్రిక్‌ కొట్టాడు. సోషల్‌ మెసేజ్‌ను ఇస్తూనే దానికి కూడా కమర్షియల్‌ హంగులు దిద్దడంలో కొరటాల శివ సెహభాష్‌ అనిపించుకుంటున్నాడు. కాగా ఇటీవల ఆయనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మూడు కాదు.....వరసగా 10బ్లాక్‌బస్టర్‌లు సాధిస్తానని, తన దగ్గర ఇప్పటికే మరో ఏడు స్టోరీలు సిద్దంగా ఉన్నాయని ఆయన చెప్పడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తన దగ్గర దర్శకునిగా మారక ముందు మొత్తం 10 స్టోరీలు రెడీ చేసి పెట్టుకున్నానని, ఇప్పటికీ తీసిన మూడు చిత్రాల తర్వాత తన చేతిలో మరో ఏడు కథలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆయన మాటలను కొంతమంది వరసగా మూడు బ్లాక్‌బస్టర్స్‌ అందించిన గర్వంతో ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడని అంటుంటే, కొందరు మాత్రం ఆయన తాను తయారుచేసుకున్న 10 అద్భుత స్టోరీలను మీద నమ్మకంతో అలా మాట్లాడాడని అంటున్నారు. ఇక కొరటాల ఇంకా మాట్లాడుతూ, తాను చేసిన మూడు చిత్రాలను నిర్మించిన నిర్మాతలు పరిశ్రమలో పెద్దగా అనుభవం లేనివారని, అందుకే ఆ బాధ్యతలు కూడా తన మీదనే పడ్డాయని, కానీ వాటిని నేను కేవలం ఓ అదనపు బాధ్యతగా ఫీలయ్యానే తప్ప బరువుగా భావించలేదని, అది తనకు మరింత అనుభవం వచ్చేందుకు ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ