Advertisementt

ప్రభుదేవా జీవితంలో మధుర క్షణాలివే!

Sat 10th Sep 2016 05:58 PM
prabhu deva,sundaram master,tutak tutak tutiya,abhinetri,devil,prabhu deva and sundaram master dance  ప్రభుదేవా జీవితంలో మధుర క్షణాలివే!
ప్రభుదేవా జీవితంలో మధుర క్షణాలివే!
Advertisement
Ads by CJ

నిన్నటితరం డ్యాన్స్‌ మాస్టర్స్‌లో సుందరం మాష్టారుది ప్రత్యేకమైన శైలి. ఇక ఆయన కుమారుడు ప్రభుదేవా ఇండియన్‌ మైఖేల్‌జాక్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి ఒకేసారి స్టెప్పులేయడం చాలా అరుదు. కాగా ఇటీవల ఓ ప్రెవేట్ టీవీ చానెల్‌ ప్రోగ్రాంలో తండ్రికొడుకులు సుందరం మాష్టార్‌, ప్రభుదేవా కలిసి స్టేజీపై కాసేపు కలసి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రభుదేవా ఇవి నా జీవితంలో మధురమైన క్షణాలని ట్వీట్‌ చేయడమే కాదు.. ఆ వీడియోను రీపోస్ట్‌ చేశాడు. ఇది ప్రభుదేవాకే కాదు.. యావత్‌ సినీ ప్రేక్షకులకు మధురమైన కానుకే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ప్రభుదేవా విజయ్‌ దర్శకత్వంలో తాను కూడా కలిసి నటిస్తూ, తమన్నా, సోనూసూద్‌ ప్రధానపాత్రల్లో 'అభినేత్రి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగువెర్షన్‌కు కోనవెంకట్‌ నిర్మాత కాగా, తమిళంలో ఈ చిత్రాన్ని ప్రభుదేవా తన స్వీయనిర్మాణంలో 'డెవిల్‌' టైటిల్‌తో విడుదలకు రెడీ చేస్తున్నాడు. ఇక హిందీలో ఈ చిత్రాన్ని సోనూసూద్‌ 'టుటక్ టుటక్ టుటియా' అనే పేరుతో రిలీజ్‌ చేయనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ