Advertisementt

శ్రీను వైట్ల ఇల్లు అమ్మేస్తున్నాడు!

Sun 11th Sep 2016 03:35 PM
srinu vaitla,house for sale,srinu vaital movies,flop movies  శ్రీను వైట్ల ఇల్లు అమ్మేస్తున్నాడు!
శ్రీను వైట్ల ఇల్లు అమ్మేస్తున్నాడు!
Advertisement
Ads by CJ

'నీకోసం, ఆనందం' చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల. ఈయన స్టార్ హీరోలను సైతం డైరెక్ట్ చేసి వారికి సూపర్ హిట్లను అందించిన దర్శకుడు. ఈయన ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే అది పక్కా కామెడి ఎంటర్టైనర్ గా ఉంటుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడు నమ్ముతాడు. మంచు విష్ణుకి 'ఢీ' వంటి హిట్ అందించిన వైట్ల, మహేష్ బాబుకి 'దూకుడు' హిట్ ఇచ్చి టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ స్థానాన్ని సంపాదించేసాడు. ఇక ఎన్టీఆర్ ని 'బాద్షా' చేశాడు. అయితే శ్రీను వైట్ల మహేష్ బాబు హీరోగా 'ఆగడు' వంటి ప్లాప్ సినిమాని తీసిన దగ్గర నుండి అతని కష్టాలు మొదలయ్యాయి. 'ఆగడు' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో  'బ్రూస్లీ'  తీసి మళ్ళీ వరసగా ప్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అతని కష్టాలు మరింత ఎక్కువయ్యానే చెప్పాలి. మొదట ఇండస్ట్రీలో ప్రకాష్ రాజుతో మొదలైన గొడవ చివరికి శ్రీను వైట్ల భార్య దగ్గరకి వచ్చి ఆగింది. వైట్ల భార్య రూప అతనిపై కేసు కూడా పెట్టింది.  ఆమధ్య భార్య భర్తలిద్దరూ విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యారనే వార్తలొచ్చాయి. మళ్ళీ ఇండస్ట్రీ లోని పెద్దలు పూనుకుని వీరిద్దరి గొడవ సెటిల్ చేశారని టాక్ కూడా వచ్చింది. ఈ దెబ్బకి వైట్లకి దర్శకునిగా అవకాశాలు బాగా తగ్గాయనే చెప్పొచ్చు. చాలా గ్యాప్ తర్వాత  వైట్ల మెగా హీరో వరుణ్ తేజ్ తో 'మిస్టర్' ని తెరకెక్కిస్తున్నాడు. అయితే వైట్ల కష్టాలు తీరలేదని అంటున్నారు. మళ్ళీ ఈ మాట ఎందుకొచ్చిందంటే శ్రీను వైట్ల ఈ మధ్య తన ఇల్లు అమ్మకానికి పెట్టాడని అంటున్నారు. అతనికున్న అప్పులు ఇంకా తీరలేదని అందుకే ఇల్లు అమ్మేస్తున్నాడనే రూమర్స్ బయటికొచ్చాయి. అయితే అతని అప్పులకి ఇంటికి సంబంధం లేదని కేవలం వాస్తు రీత్యానే  అతను ఇల్లు  అమ్ముతున్నాడని అంటున్నారు అతని సన్నిహితులు. వాస్తు బాగాలేకే అతనికి దర్శకునిగా అవకాశాలు తగ్గాయని వైట్ల అనుకుంటున్నాడని అందుకే ఇల్లు అమ్మేస్తే ప్రాబ్లెమ్ తీరుతుందని అనుకుని ఇల్లు అమ్మకానికి పెట్టాడని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ