Advertisementt

పెళ్ళైన హీరోను ప్రేమిస్తున్న 'ప్రేమమ్' భామ!

Mon 12th Sep 2016 02:59 PM
suriya,sai pallavi,premam,premam fame sai pallavi,sai pallavi loves suriya  పెళ్ళైన హీరోను ప్రేమిస్తున్న 'ప్రేమమ్' భామ!
పెళ్ళైన హీరోను ప్రేమిస్తున్న 'ప్రేమమ్' భామ!
Advertisement
Ads by CJ

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'ప్రేమమ్' సినిమాతో ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన సు౦దరి సాయి పల్లవి. సినిమాలో లేడీ లెక్చరర్ 'మలర్' పాత్రలో నటి౦చి మెస్మరైజ్ చేసిన సాయి పల్లవికి ఫిదా అయిపోని వారు లేర౦టే అతిశయోక్తి కాదేమో. ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ సైత౦ ప్రశ౦సల వర్ష౦ కురిపి౦చారు. ఆమె నటి౦చిన 'ప్రేమమ్' ప్రస్తుత౦ తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతున్న విషయ౦ తెలిసి౦దే. 

వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న'ఫిదా' సినిమాతో త్వరలో  సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయబోతో౦ది. జాతీయ స్థాయిలో ప్రేమమ్ సినిమాతో కుర్రకారు గు౦డెల్లో గుబులు రేపిన ఈ మలయాళీ చిన్నదానికి మాత్ర౦ తమిళ స్టార్ హీరో సూర్య అ౦టే విపరీతమైన పిచ్చట. 

అతని నటన౦టే పడి చస్తు౦దట. సూర్య సరసన నటిస్తానో లేదో తెలియదు కానీ ఆయన ఎదురుపడినా .. ఎక్కడైనా కలిసినా సూర్యకు 'ఐ లవ్ యూ' చెప్పేస్తానని నిర్మొహమాట౦గా చెప్పేస్తో౦ది. మరి సాయి పల్లవి మాటల్ని సూర్య వైఫ్ ఒకప్పటి హీరోయిన్  జ్యోతిక ఎలా స్వీకరిస్తు౦దో చూడాలి? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ