Advertisementt

కేసీఆర్, పవన్ లు కలుస్తున్నారు..!!

Tue 13th Sep 2016 12:43 AM
pawan kalyan,kcr,telangana,special status,jaguar,jaguar audio launch,pawan and kcr in one stage  కేసీఆర్, పవన్ లు కలుస్తున్నారు..!!
కేసీఆర్, పవన్ లు కలుస్తున్నారు..!!
Advertisement
Ads by CJ

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార్ హీరోగా 'జాగ్వార్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాగ్వార్ చిత్రంలో మిల్కి బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలిసిన విషయమే. తన కొడుకు హీరోగా సెటిల్ అవ్వాలని కుమార స్వామి పట్టుదలగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తన కొడుక్కి అప్పుడే ఇండస్ట్రీ పెద్దల దీవెనలు ఇప్పించడం కూడా చేసేసాడు. ఇక 'జాగ్వార్' ఆడియో ని ఒక పెద్ద వేడుకగా నిర్వహించాలని... ఈ ఆడియో వేడుకకి ఇండస్ట్రీ పెద్దలనే కాకుండా పొలిటికల్ పెద్దలని కూడా ఆహ్వానిస్తున్నాడట కుమారస్వామి. ఇప్పటికే ఈయన పవర్ స్టార్ పవన్ ని కలిసి నిఖిల్ కుమార్ నటించిన 'జాగ్వార్' ఆడియో కి రావాల్సిందిగా ఆహ్వానించాడట. ఇంకా తెలంగాణ సీఎం కేసీఆర్ ని కూడా ఆడియో వేడుకకి రావాల్సిందిగా స్పెషల్ గా ఆహ్వానించినట్టు వార్తలొస్తున్నాయి. మరి ఈ ఆడియో కి పవన్ ఇంకా కేసీఆర్ స్పెషల్ గెస్టు లుగా హాజరవ్వొచ్చని అంటున్నారు. ఒక వేళ వీరిద్దరూ గనక ఈ వేడుకకి హాజరైతే మాత్రం వీరిద్దరూ పేస్ టూ పేస్ కలుసుకునే అవకాశం వస్తుంది. వీరిద్దరూ ఒకే స్టేజి మీద కలవడం మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది. ఇప్పటికే పవన్ ప్రత్యేక హోదా విషయం లో ఏపీ ప్రజల తరుపున పోరాటం చేస్తున్నాడు. ఇక కేసీఆర్ ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు కానుకగా ఇచ్చి చరిత్రకెక్కాడు. ఇలాంటి వీరిద్దరి ఈ కలయిక ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి 'జాగ్వార్' చిత్రం ఇంకా ఎన్ని సెన్సేషన్స్ కి వేదిక కాబోతుందో మరి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ