పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ ఆర్దిక నిధుల కోసం ఓ బడా పారిశ్రామిక వేత్త, సినీ నిర్మాతైన పివిపి.. పవన్‌కు గత ఎన్నికలప్పుడు 200కోట్లు ఫండ్ ఇస్తానని, జనసేనలో మంచి పదవితో పాటు విజయవాడ ఎంపీ స్దానాన్ని ఇప్పించాలని పవన్‌ను పివిపి మాయచేయబోయాడని.. కానీ వాటిని పవన్ వద్దని చెప్పారని సమాచారం. పివిపి మనస్తత్వం నచ్చని పవన్ ఆ ఆఫర్‌ను స్వయంగా నిరాకరించాడని, ఆయన దగ్గర ఓ సినిమా చేయడానికి తీసుకున్న అడ్వాన్స్‌ను సైతం పవన్ తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. తెలిసి తెలిసి ఆయన డబ్బుల కోసం రాజకీయం నడపలేనని, పార్టీలో అలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని పవన్ భావిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం వామపక్షాలతో పాటు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ తదితర మేథావులు వంటి వారికే పార్టీలో చోటు ఇవ్వాలని భావిస్తున్నాడని సమాచారం. మొత్తంగా పవన్ డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చాడంటూ ఆయనను తప్పుపడుతున్నవారికి తాజా వార్త కళ్లు తెరిపిస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు.