వరస విజయాలతో దూసుకెళ్తున్న స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ త్వరలో దిల్‌రాజు నిర్మాతగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో 'డీజె' (దువ్వాడ జగన్నాథం) అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో జరగనుంది. కాగా ప్రస్తుతం ప్రీపొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. మొదట్లో పూజాహెగ్డే పేరు వినిపించింది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ పేరు ప్రచారంలోకి వచ్చింది. రీసెంట్ గా మెహరీన్ అన్నారు. కాగా ఈ చిత్రంలో బన్నీ సరసన పూజాహెగ్డేను ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆమె తెలుగులో 'ముకుందా', 'ఒక లైలా కోసం' చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి.కాగా ఇటీవలే ఆమె హృతిక్‌రోషన్ సరసన 'మొహంజదారో' చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో ఆమెపై ఐరన్‌లెగ్ ముద్రపడింది. కానీ వాటిని పట్టించుకోకుండా బన్నీ తన 'డిజె' చిత్రంలో ఆమెనే ఎంచుకున్నాడంటే అది అదృష్టమేనని చెప్పవచ్చు.