పవన్ కళ్యాణ్ - దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నామని ఆ మధ్య ఎప్పుడో ప్రకటించారు. కొంత కాలంగా కామ్ గా వున్న ఈ ప్రాజెక్ట్ లో ఈ మధ్య కొంత కదలిక వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పవన్ తాను ఒప్పుకున్న సినిమాలు తొందరగా పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడని.. అందుకే దాసరి తో చెయ్యబోయే సినిమాని కూడా లైన్ లో పెట్టాడని వార్తలొచ్చాయి. ఎలాగూ రాజకీయాల్లో బిజీ కాబోతున్నాడుగా అందుకే పవన్ చెప్పినవి నిజమనే ప్రచారం జరుగుతుంది. అయితే దాసరి ఈ మధ్య తారకప్రభు ఫిలిమ్స్ పై ఫిలిం ఛాంబర్ లో ఒక టైటిల్ ని రిజిస్టర్ చేయించాడని, ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ కోసమే అని అంటున్నారు. దాసరి రిజిస్టర్ చేయించిన ఆ టైటిల్ 'బోస్' అని, దీనికి టాగ్ లైన్ గా 'సన్నాఫ్ ఇండియా' అని తెలిసింది. ఈ టైటిల్ అయితే పవన్ కి కరెక్ట్ గా సరిపోతుందని అంటున్నారు. ఇక దాసరి చాలా కాలం నుండి సినిమాలు చెయ్యకుండా ఖాళీగా ఉంటున్న విషయం తెలిసిందే. మరి ఇన్ని రోజుల తర్వాత పవన్ తో సినిమా చేస్తానని ఆయన ప్రకటించడం దానికి పవన్ కూడా దాసరి ప్రొడ్యూసర్ గా సినిమా ఉంటుందని చెప్పడం జరిగాయి. ఇప్పుడు ఈ టైటిల్ రిజిస్టేషన్ అంతా పవన్ కోసమే అని ప్రచారం జరుగుతుంది. మరి దాసరి పవన్ కోసమే 'బోస్' టైటిల్ రిజిస్టర్ చేయించాడా లేక వేరే హీరో ఎవరికైనా చేయించాడా అనేది తెలియాల్సి వుంది. ఇప్పటికే పవన్ అభిమానులు 'బోస్' టైటిల్ పవన్ కి కరెక్ట్ గా సూట్ అవుతుందని అంటున్నారు.