ఇటీవల వచ్చిన 'బాబు బంగారం' చిత్రం కమర్షియల్‌గా వర్కౌట్ కావడంతో సీనియర్‌స్టార్ వెంకటేష్ మంచి ఊపు మీదున్నాడు. కాగా ఆయన నటించనున్న బాలీవుడ్‌లో మాధవన్ హీరోగా తెరకెక్కిన హిందీ చిత్రం 'సాలా ఖుద్దుస్' చిత్రం రీమేక్‌కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రంలో మాజీ బాక్సర్‌గా నటిస్తున్న వెంకీ ఆ పాత్ర కోసం బాడీ బిల్డింగ్‌తో పాటు బాక్సింగ్‌లో కూడా ట్రైనింగ్ తీసుకుంటూ మేకోవర్ సాధిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కించిన దర్శకురాలు సుధాకొంగరే తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రానికి 'గురు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తమిళ, హిందీ భాషల్లో నటించిన రితిక లీడ్ రోల్ పోషించనుంది. కాగా ఈ చిత్రానికి శంకర్‌నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 19నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి బాక్సర్‌గా, ఆ తర్వాత బాక్సింగ్ కోచ్‌గా వెంకీ ఈ చిత్రంతో మరో మంచి హిట్‌ను సాధించడం ఖాయమని ఆయన అభిమానులు ఎన్నో ఆశలతో ఉన్నారు.