పాపం నయనతార ప్రేమ జీవితం అస్సలు సాఫీగా లేదు. ముందు శింబు ప్రేమలో మునిగిన నయనతార అతి కొద్దికాలం లోనే బ్రేకప్ చేసుకుని ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ గడిపేశారు. మళ్లీ నయనతార...ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించి .... పెళ్లివరకు వెళ్లిన వాళ్ళు ఏమైందో ఏమో ప్రభుదేవాతో కూడా తెగతెంపులు చేసుకుంది. ప్రభుదేవా అయితే తన భార్యకు విడాకులిచ్చి మరీ ఈ పెళ్ళికి సిద్ధపడ్డాడు. మరి ఇంత డీప్ గా ప్రేమలో మునిగి పెళ్లిపీటలెక్కుతున్న సమయంలో వీరు పెళ్లిని అర్ధాంతరంగా ఆపేశారు. మళ్లీ ఫ్రీ అయిన నయన తన రెండో ఇన్నింగ్స్ లో సినిమాల మీద కాన్సంట్రేషన్ పెట్టి బాగా బిజీ అయిపొయింది. ప్రేమ గీమా అంటూ తన లైఫ్ ని పాడుచేసుకోకూడనుకుందేమో కొన్నాళ్లు సైలెంట్ అయినా... నయన్ మళ్లీ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమలో పడింది. ఎందుకంటే వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా ఎక్కడబడితే అక్కడ మీడియా కి దొరుకుతున్నారని.... ఇప్పటికే వీళ్ళ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ లా పాకిపోయాయని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఆ మధ్య మీడియా ఒకసారి నయన్ ని ఇదే విషయం అడిగితే మా మధ్య అలాంటిదేమి లేదని సమాధానం చెప్పింది. కానీ వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు వీటన్నిటిని నిజం చేస్తూ కేరళ పండగ 'ఓనం' సందర్భంగా నయన్, విగ్నేష్ శివన్ ని తన ఇంటికి ఆహ్వానించిందని అక్కడ వీరిద్దరూ 'ఓనం' పండుగను సెలెబ్రేట్ చేసుకున్నట్లు సెల్ఫీలు దిగి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి వీరిద్దరూ డీప్ లవ్ లో వుండబట్టేగదా ఇలా ఫొటోస్ అవి పోస్ట్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏమి లేకపోతె ఇలా ఫొటోస్ లో దొరకరు కదా అంటున్నారు. అయినా సైలెంట్ గా వీరిద్దరూ ఎప్పుడోకప్పుడు పెళ్లి చేసుకున్నా ఆశ్చర్య పోవక్కర్లేదు అంటున్నారు కోలీవుడ్ జనాలు.