Advertisementt

ఆదాశర్మ..కోసం మరో క్షణం..!

Fri 16th Sep 2016 01:54 PM
adah sharma,kshanam,tamil remake,sibiraj,satyaraj,adah sharma in tamil kshanam movie  ఆదాశర్మ..కోసం మరో క్షణం..!
ఆదాశర్మ..కోసం మరో క్షణం..!
Advertisement
Ads by CJ

ఈ సంవత్సరం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో క్షణం చిత్రం కూడా ఒకటి. చిన్న సినిమాగా విడుదలై భారీస్థాయిలో వసూళ్ళను రాబట్టిన చిత్రం క్షణం. చిన్న సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించింది. అడవి శేష్ హీరోగా నటించిన ఈసినిమాలో ఆదా శర్మ హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం తెలుగులో విడుదలైనప్పటి నుండి పలు భాషా ప్రముఖులు రీమేక్ పై ఎగబడుతున్నారు. హిందీలో చేయడానికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ క్షణం.. రీమేక్ రైట్స్ తీసుకోవడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. 

క్షణం సినిమాను కోలీవుడ్ లో కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ ఇమేజ్ పొందిన సత్యరాజ్, తన కుమారుడు శిబిరాజ్ ను హీరోగా పెట్టి ఈ సినిమాను రీమేక్ చేసేందుకు అంతా సిద్ధమైనట్లుగానే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందనే చెప్పాలి. కానీ తెలుగులో  హీరోయిన్ గా ఆదాశర్మ అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. అందుకనే  తమిళంలో కూడా హీరోయిన్ గా  ఆమెనే తీసుకున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.  

తెలుగు క్షణంలో బిడ్డను కోల్పోయిన తల్లిగా ఆదాశర్మ అద్భుత నటనను ప్రదర్శించింది. అందుకనే తమిళ వర్షన్ కు కూడా ఆమెనే ఎంపిక చేశారన్నది సమాచారం. అంటే ఇక ఆదాశర్మ బిజీ బిజీ కాబోతుందన్న మాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ