ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ తన ఆలోచనలు, సిద్దాంతాలు, జనసేన ఆవిర్బావం వంటివి తెలియజేస్తూ 'నేను-మనం-జనం' (మార్పు కోసం యుద్దం) అనే పుస్తకాన్ని రాస్తున్నాడు. గతంలో ఆయన రాసిన 'ఇజం' పుస్తకం ఎవరికీ సరిగా అర్దమయ్యే రీతిలో లేదన్న విమర్శలు వచ్చాయి. అందుకే ఆ పుస్తకం కంటే సరళంగా, సూటిగా, అందరికీ అర్దమయ్యే మాటలతో ఈ తాజా పుస్తకాన్ని రచిస్తున్నారు. కాగా మొదట ఈ చిత్రాన్ని పవనే తన సొంతగా రాయాలని భావించినప్పటికీ ఇప్పుడు ఆ బాధ్యతలను 'సర్దార్ గబ్బర్‌సింగ్' సమయంలో తనకు అత్యంత నమ్మకంగా పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్‌కి ఈ బాధ్యతలు అప్పగించాడని సమాచారం. 'ఇజం' పుస్తకాన్ని కూడా పవన్ సొంతగా రాయలేదు. ఆయనలోని భావాలను ఆయన డిక్టేట్ చేస్తుంటే దానికి పవన్ మిత్రుడు రాజు రవితేజ అక్షరరూపం ఇచ్చాడు. ఆయనే ఈ పుస్తకాన్ని రచించినందుకు బుక్‌లో కూడా ఆయన పేరే వేశారు. ఇప్పుడు కూడా పవన్ ఒక్కో చాప్టర్‌ను డిక్టేట్ చేస్తుంటే దానిని రికార్డ్ చేసి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ దానిని పుస్తకంపై ఆవిష్కరిస్తున్నాడు. ఇంతకీ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు మాత్రం తెలియరావడం లేదు. కాగా ఈ పుస్తకాన్ని వచ్చే ఏడాది ప్రథమార్దంలో విడుదల చేయాలని పవన్ భావిస్తున్నాడు.