Advertisementt

యూవీ క్రియేషన్స్‌ ప్లానింగ్ బాగుంది..!

Sat 17th Sep 2016 11:41 AM
uv creations,ram charan,prabhas,uv creations movies list  యూవీ క్రియేషన్స్‌ ప్లానింగ్ బాగుంది..!
యూవీ క్రియేషన్స్‌ ప్లానింగ్ బాగుంది..!
Advertisement
Ads by CJ

అతి తక్కువ కాలంలో, అతి తక్కువ చిత్రాలతోనే యువి క్రియేషన్స్‌ బేనర్‌ ఓ మంచి అభిరుచి ఉన్న సంస్దగా పేరు తెచ్చుకుంది. కాగా ఇప్పటికే ఈ సంస్ద 'మిర్చి, రన్‌ రాజా రన్‌, భలే భలే మగాడివోయ్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రాలతో జోరుమీదుంది. కాగా ప్రస్తుతం ఆ సంస్ద 'పిల్ల జమీందార్‌' ఫేమ్‌ అశోక్‌ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో 'భాగమతి' చిత్రం చేస్తోంది. ఇక ఈ సంస్ద వచ్చే ఏడాది రెండు పెద్ద సినిమాలను తెరకెక్కించడానికి రెడీ అవుతోంది. అందులో ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో ఓ చిత్రం. ఈ చిత్రం 'బాహుబలి2'లో ప్రభాస్‌ పాత్ర షూటింగ్‌ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో సుజీత్‌ చిత్రం మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సంస్ద రామ్‌చరణ్‌ హీరోగా మరో చిత్రం పట్టాలెక్కించనుంది.ఈ చిత్రం ఎవరి దర్శకత్వంలో రూపొందనుందనే విషయం మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి భవిష్యత్తులో ఈ నిర్మాణసంస్ధ మరెన్ని ఉన్నత శిఖరాలను చేరుకుంటుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ