Advertisementt

కూతురి కోసం రాజశేఖర్ స్కెచ్..!

Sat 17th Sep 2016 04:05 PM
rajasekhar,sivani,naga sourya,sivani with naga shourya  కూతురి కోసం రాజశేఖర్ స్కెచ్..!
కూతురి కోసం రాజశేఖర్ స్కెచ్..!
Advertisement
Ads by CJ

రాజశేఖర్ - జీవిత ఇద్దరూ నటులే. ఈ మధ్య రాజశేఖర్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. బాగా గ్యాప్ వచ్చేసింది. అయితే రాజశేఖర్, తేజ డైరెక్షన్ లో విలన్ గా చేయబోతున్నాడనే వార్తలొచ్చాయి. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదనుకోండి. ఇక జీవిత జీ తెలుగు లో వచ్చే బతుకు జట్కా బండి ప్రోగ్రాం కి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తూ బిజీ అయిపొయింది. అయితే జీవిత - రాజశేఖర్  దంపతులు  తన ఇద్దరు కూతుళ్ళని హీరోయిన్స్ గా చేద్దామనే ఆలోచనలో ఎప్పటినుండో వున్నారు. అందుకే వీరికి యాక్టింగ్ లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నారని అంటున్నారు. అయితే ముందుగా పెద్ద కూతురు శివానిని లైన్ లోకి తీసుకు రావడానికి వీరు ముమ్మరం గా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇక  త్వరలోనే శివాని  సినీ రంగ ప్రవేశానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఆమె మొదటగా నటించబోయే సినిమాలో ఏ హీరో తో నటిస్తే బావుంటుందో అని తెగ సెర్చ్ చేస్తున్నారని... ఆ హీరో టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నాగ సౌర్య అయితే బావుంటుందని అనుకుంటున్నారట. ఇక నాగ సౌర్య హీరో గా నటించే సినిమాలో శివాని తెరంగేట్రం చేయబోతోందని సమాచారం. ఈ చిత్రాన్ని ఒక అగ్ర నిర్మాత నిర్మించబోతున్నాడనే వార్తలొస్తున్నాయి. ఇక ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుందని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ