Advertisementt

‘సైన్మా’ సినిమా కాబోతుంది..!

Sat 17th Sep 2016 07:41 PM
sainma telugu short film,sainma change in movie,tharun bhaskar director,pelli choopulu  ‘సైన్మా’ సినిమా కాబోతుంది..!
‘సైన్మా’ సినిమా కాబోతుంది..!
Advertisement
Ads by CJ

'పెళ్లి చూపులు' సినిమాతో రియల్ దర్శకుడు హోదాను సొంతం చేసుకున్నాడు తరుణ్ భాస్కర్.   చిన్న సినిమాగా విడుదలైన పెళ్ళి చూపులు భారీ వసూళ్ళతో బంపర్ హిట్ అందుకొన్న విషయం తెలిసిందే. చేసింది తక్కువ బడ్జెట్ లో అయినా  రాబట్టింది మాత్రం భారీ మొత్తమే. అది సరే  ఈ చిత్రం ఇచ్చిన హిట్ టాక్ తో నిర్మాతలంతా తరుణ్ భాస్కర్ చుట్టూతా తిరుగుతున్న విషయం కూడా తెలిసిందే. కానీ ఇప్పుడంతా తరుణ్ భాస్కర్ వెంటబడుతుంటే ఆ దర్శకుడు మాత్రం పెళ్లి చూపుల్లోనే తనకు బ్రేక్ ఇచ్చిన అదే నిర్మాతతో మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే గతంలో తరుణ్ భాస్కర్ 'సైన్మా' పేరుతో ఓ  షార్ట్ ఫిలిం చేశాడు. ఇప్పుడు అదే షార్ట్ ఫిల్మ్ ను పూర్తి స్థాయి సినిమాగా తీయాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తుంది! కాగా పెళ్ళి చూపులు నిర్మాత రాజ్ కందుకూరితోనే చేసే ఈ సినిమాలో మొత్తం కొత్తవాళ్లే నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్ టాక్. షార్ట్ ఫిల్మ్ గా వచ్చిన 'సైన్మా' యూట్యూబ్ లో బాగా పాపులర్ అయింది. ఆ ఫిల్మ్ నే పూర్తి స్థాయి సినిమాగా చేయాలనే ప్రయత్నంలో తరుణ్ భాస్కర్ ఉన్నట్లు పరిశ్రమ వర్గాల నుండి సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ పనులు కూడా త్వరత్వరగా జరుగుతున్నట్లు వెల్లడౌతుంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందిన సమాచారం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ